Education-Article
OUలో పార్ట్‌ టైం పీజీ

ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ - పార్ట్‌ టైం పీజీ (పీటీపీజీ) కోర్సులలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంఈ, ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఈవెనింగ్‌ కోర్సులు. ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. ఇందులో ఆరు సెమిస్టర్‌లు ఉంటాయి. ఈ కోర్సులను ఇండస్ట్రీ స్పాన్సర్డ్‌/ నామినేటెడ్‌ అభ్యర్థులకు ప్రత్యేకించారు. అకడమిక్‌ ప్రతిభ, అనుభవం ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 


విభాగం - స్పెషలైజేషన్‌ - సీట్లు

సివిల్‌ ఇంజనీరింగ్‌ (స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌) - 5

ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ (డిజిటల్‌ సిస్టమ్స్‌) - 5

ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ (పవర్‌ సిస్టమ్స్‌) - 5

మెకానికల్‌ ఇంజనీరింగ్‌ (ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌)- 5

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ - 5


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ/ ఏఎంఐఈటీఈ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. ఇండస్ట్రీ/ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌/ రీసెర్చ్‌ ఎస్టాబ్లి్‌షమెంట్స్‌లో కనీసం రెండేళ్లు పనిచేసిన (ఆగస్టు 31 నాటికి) అనుభవం ఉండాలి. స్పాన్సర్డ్‌ అభ్యర్థులు సంబంధిత లెటర్‌ సబ్మిట్‌ చేయాలి. 


ముఖ్య సమాచారం

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.1,000

దరఖాస్తు తేదీ: అక్టోబరు 23

కౌన్సెలింగ్‌ వేదిక: ఈ - క్లాస్‌ రూం, మెయిన్‌ బిల్డింగ్‌, యూసీఈ ఓయూ 

వెబ్‌సైట్‌: uceou.edu

Tags :