Education-Article
NIDలో డిజైన్‌ ప్రోగ్రామ్‌లు

అహ్మదాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) - బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్‌ సహా అహ్మదాబాద్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోం క్యాంపస్‌లలో బీ డిజైన్‌ కోర్సు అందుబాటులో ఉంది. దీని వ్యవధి నాలుగేళ్లు. అహ్మదాబాద్‌, బెంగళూరు, గాంధీనగర్‌ క్యాంపస్‌లలో ఎం డిజైన్‌ కోర్సు ఉంది. దీని వ్యవధి రెండున్నరేళ్లు. 


ఈ ప్రోగ్రామ్‌లను ఆంగ్ల భాషలో నిర్వహిస్తారు. డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (డీఏటీ) ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ దశలు ఉంటాయి. ప్రిలిమ్స్‌లో అర్హత పొందినవారిని మెరిట్‌ ప్రకారం షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ప్రతి కేటగిరీలో సీట్ల సంఖ్యకు మూడు రెట్లమందిని మెయిన్స్‌కు అనుమతిస్తారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ స్కోర్‌ల ఆధారంగా తదుపరి అడ్మిషన్‌ ప్రక్రియ నిర్వహిస్తారు.


బీ డిజైన్‌

సీట్లు: అహ్మదాబాద్‌ క్యాంపస్‌లో 125 సీట్లు; ఆంధ్రప్రదేశ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోం క్యాంపస్‌లలో ఒక్కోదానిలో 75 సీట్లు ఉన్నాయి. విదేశీ విద్యార్థుల కోసం అహ్మదాబాద్‌ క్యాంపస్‌లో 19 సీట్లు, మధ్యప్రదేశ్‌ క్యాంపస్‌లో 11 సీట్లు ఉన్నాయి.

అర్హత: అభ్యర్థులు 2002 జూలై 1 తరవాత జన్మించి ఉండాలి. సీబీఎస్‌ఈ/ ఐబీ/ ఐసీఎస్‌ఈ/ ఇతర గుర్తింపు పొందిన బోర్డ్‌ల నుంచి 2022 మే/ జూన్‌ నాటికి సైన్స్‌, ఆర్ట్స్‌, కామర్స్‌, హ్యుమానిటీస్‌ గ్రూప్‌లతో ఇంటర్‌/ పన్నెండో తరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ నిర్వహించే రెండేళ్ల ‘జాయింట్‌ సర్వీసెస్‌ వింగ్‌ కోర్సు’ ఉత్తీర్ణులు; నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (ఎన్‌ఐఓఎస్‌) నుంచి కనీసం అయిదు సబ్జెక్ట్‌లతో సీనియర్‌ సెకండరీ స్కూల్‌ ఎగ్జామినేషన్‌ ఉత్తీర్ణులు; హెచ్‌ఎస్‌సీ ఒకేషనల్‌ ఎగ్జామ్‌ పాసైనవారు; బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించే మూడేళ్ల డిప్లొమా కోర్సులు పూర్తిచేసినవారు; జనరల్‌ సర్టిఫికెట్‌ ఎడ్యుకేషన్‌ (జీసీఈ) అడ్వాన్స్‌డ్‌ లెవెల్‌ ఎగ్జామ్‌ (లండన్‌/ శ్రీలంక) ఉత్తీర్ణులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. 

డీఏటీ వివరాలు: ప్రిలిమ్స్‌ను పేపర్‌ - పెన్సిల్‌/ పెన్‌ విధానంలో నిర్వహిస్తారు. టెక్ట్స్‌, విజువల్స్‌ అంశాల నుంచి ప్రశ్నలను ఆంగ్ల మాధ్యమంలో అడుగుతారు. పరీక్ష వ్యవధి వివరాలను అడ్మిట్‌కార్డ్‌లో తెలియజేస్తారు.   


ఎం డిజైన్‌

విభాగాలు - సీట్లు: అహ్మదాబాద్‌ క్యాంపస్‌లో యానిమేషన్‌ ఫిల్మ్‌ డిజైన్‌, ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, ఫర్నిచర్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌ విభాగాల్లో ఒక్కోదానిలో 19 సీట్లు; సిరామిక్‌ అండ్‌ గ్లాస్‌ డిజైన్‌లో 12 సీట్లు ఉన్నాయి. గాంధీనగర్‌ క్యాంపస్‌లో ఫొటోగ్రఫీ డిజైన్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ ఆటొమొబైల్‌ డిజైన్‌, న్యూ మీడియా డిజైన్‌, స్ట్రాటజిక్‌ డిజైన్‌ మేనేజ్‌మెంట్‌, అప్పారెల్‌ డిజైన్‌, లైఫ్‌ స్టయిల్‌ యాసెసరీ డిజైన్‌ విభాగాల్లో ఒక్కోదానిలో 19 సీట్లు; టాయ్‌ అండ్‌ గేమ్‌ డిజైన్‌లో 12 సీట్లు ఉన్నాయి. బెంగళూరు క్యాంపస్‌లో యూనివర్సల్‌ డిజైన్‌, డిజిటల్‌ గేమ్‌ డిజైన్‌, ఇన్ఫర్మేషన్‌ డిజైన్‌, ఇంటరాక్షన్‌ డిజైన్‌, డిజైన్‌ ఫర్‌ రిటైల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ విభాగాల్లో ఒక్కోదానిలో 19 సీట్లు ఉన్నాయి.   

అర్హత: అభ్యర్థులు 1992 జూలై 1 తరవాత జన్మించి ఉండాలి. ఇంటర్‌ తరవాత మూడేళ్లు/ నాలుగేళ్ల వ్యవధిగల ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిజైన్‌, ఫైన్‌ ఆర్ట్స్‌, అప్లయిడ్‌ ఆర్ట్స్‌, ఆర్కిటెక్చర్‌ విభాగాల్లో నాలుగేళ్ల డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులే. 

డీఏటీ వివరాలు: ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో కామన్‌ డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, స్పెసిఫిక్‌ టెస్ట్‌ ఉంటాయి. వీటిలో ఆబ్జెక్టివ్‌, సబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు అడుగుతారు.  


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌ అభ్యర్థులకు రూ.3,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1500; విదేశీ విద్యార్థులకు రూ.5,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30

డీఏటీ ప్రిలిమ్స్‌ అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడింగ్‌: డిసెంబరు 23 నుంచి

ప్రిలిమ్స్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ

డీఏటీ ప్రిలిమ్స్‌ తేదీ: 2022 జనవరి 2 

వెబ్‌సైట్‌: admissions.nid.edu


Tags :