Education-Article
డిగ్రీ కాలేజీల్లో సీట్ల కేటాయింపుపై ‘స్టే’

అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 20 నుంచి జరగనున్న సీట్ల కేటాయింపును హైకోర్టు నిలుపుదల చేసింది. అయితే వెబ్‌ ఆప్షన్‌ ద్వారా కళాశాల ఎంపిక ప్రక్రియను కొనసాగించవచ్చని తెలిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఆర్‌. రఘునందనరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లోని 70ు కన్వీనర్‌ కోటా సీట్లు, 30ు యాజమాన్య కోటా సీట్లను కన్వీనర్‌ ద్వారా భర్తీ చేసుకునేలా.. ప్రభుత్వం జారీ చేసిన జీవో 55ని సవాల్‌ చేస్తూ రాయలసీమ డిగ్రీ కాలేజీల అసోసియేషన్‌ హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా.. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ, ఉన్నత విద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది రఘువీర్‌ వాదనలు వినిపించారు.

Tags :