Education-Article
సమస్యలు పరిష్కరించకపోతే పోరు తప్పదు!

ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతల వెల్లడి


అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తప్పదని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. చరిత్రలో ఎన్నడూ ఒకటో తేదీన జీతాలు పడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన ఉదంతం లేదని వాపోయా రు. మంగళవారమిక్కడ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆయన నివాసంలో, అమరావతి సచివాలయంలో సీఎస్‌ సమీర్‌శర్మను వా రు కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్‌తో చర్చించి దసరా కానుకగా ఉద్యోగుల కు 11వ పీఆర్‌సీ ఇవ్వాలని సజ్జలను కోరామని బండి శ్రీనివాసరావు తెలిపారు. సీఎంకు ఉద్యోగుల తరఫున మెమోరాండం ఇవ్వాలని ఆయన్నే కోరామన్నారు. ‘రాష్ట్రంలో ఇప్పటి వరకూ పెన్షనర్లకు పెన్షన్లు పడలే దు. 1న జీతం పడేలా చూడాలని కోరాం. ఇలాంటి డిమాండ్‌ పెట్టినందుకు చాలా బాధపడుతున్నాం. రాజకీయ నిర్ణయం తీసుకునైనా దసరాకు పీఆర్‌సీ ఇచ్చేలా చేయాలని కోరాం. పక్క రాష్ట్రంలో పీఆర్‌సీ ఇచ్చారు. ఇక్కడ ఇప్పటికే 39 నెలలు ఆలస్యమైంది. పీఆర్‌సీ రిపోర్టును కూడా ఇంకా బయటపెట్టలేదన్న అంశాన్ని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లాం. 1నే జీతాల చెల్లింపును పెద్ద ప్రాధాన్యంగా తీసుకోవాలని ఇద్దరినీ కో రాం.


సమస్యలపై సజ్జల సానుకూలంగా స్పందించారు. రెండ్రోజుల్లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. పీఆర్‌సీని అతిత్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి ఇంక సమయం ఇవ్వలేమని చెప్పాం’ అని వెల్లడించారు. అనంతరం బొప్పరాజు వెంకటేశ్వ ర్లు మాట్లాడుతూ.. ‘సీపీఎస్‌ రద్దు చేయాలని, కాంట్రా క్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ చేయాలని, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీత భత్యాలు పెంచాలని కోరాం. సీఎ్‌ఫఎం్‌సను రద్దు చేయాలన్నాం. సీఎం తక్షణం అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలనీ కోరాం. సమస్యలు పరిష్కరించకపోతే.. ఉద్యమబాట పడతామని చెప్పాం’ అని తెలిపారు.

Tags :