Education-Article
వేతన బకాయిలు ఇప్పించండి

మంత్రి, ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీకి ఈయూ వినతి


‘ఏపీఎ్‌సఆర్టీసీలో నాలుగేళ్లకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది.. నాలుగున్నరేళ్లయినా 2017 ఏప్రి ల్‌ నాటి బకాయిలు చెల్లించలేదు.. ఇకనైనా ఇప్పించండి..’ అంటూ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) రవాణాశాఖ మంత్రితో పాటు ఆశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీకి మంగళవారం విజ్ఞప్తి చేసింది. జేఏసీతో యాజమాన్యం చేసుకున్న ఒప్పం దం ప్రకారం 2020 జూలై నాటికే బకాయిలు 4 విడతల్లో చెల్లించాల్సి ఉందని యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు వైవీ రావు, పీ దామోదర్‌రావు రాతపూర్వకంగా ప్రభుత్వ పెద్దలకు వివరించారు. 2020 జనవరి తర్వాత లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌కు అవకాశం కల్పించిన ఎండీ తిరుమలరావుకు కృతజ్ఞతలు తెలిపిన ఈయూ నేతలు.. 2017నుంచి 2019 వరకూ పెండింగ్‌లో ఉన్న వాటిని కూడా ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. 

Tags :