Education-Article
Municipal Teachers సమస్యలపై చర్చలు

అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ టీచర్లకు పీఎఫ్‌ ఖాతాలను త్వరలోనే ప్రారంభిస్తామని మున్సిపల్‌ శాఖ పేర్కొంది. పురపాలక టీచ ర్ల సమస్యలపై యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కె.ఎ్‌స.ఎ్‌స.ప్రసాద్‌, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు కె.ఎ్‌స.లక్ష్మణ్‌రావు, షేక్‌ సాబ్జీలతో మున్సిపల్‌ శాఖ ఉన్నతోద్యోగులు మంగళవారం చర్చలు జరిపారు. సబ్జెక్టు వారీగా టీచర్లు ఎంతమంది కావాలన్న దానికి అనుగుణంగా ఉన్న పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయడం, లేకుంటే కొత్తగా పోస్టులు భర్తీ, స్కూల్‌ అసిస్టెంట్లకు కూడా పదోన్నతి షెడ్యూల్‌ ప్రకటిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

Tags :