Education-Article
DGPMలో స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ, న్యూడిల్లీలోని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌కి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ జనరల్‌ పర్ఫార్మెన్స్‌(డీజీపీఎం)... స్పోర్ట్స్‌ కోటా ద్వారా వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 24

టాక్స్‌ అసిస్టెంట్‌: 10

స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2: 01

హవల్దార్‌: 10

ఎంటీఎస్‌: 03

క్రీడాంశాలు: క్రికెట్‌, హాకీ, ఫుట్‌బాల్‌, అథ్లెటిక్స్‌, స్విమ్మింగ్‌, బ్యాడ్మింటన్‌

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ నాలెడ్జ్‌, టైపింగ్‌ నైపుణ్యాలతోపాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. క్రీడార్హతలో భాగంగా అంతర్జాతీయ స్థాయి, సీనియర్‌/జూనియర్‌ స్థాయి చాంపియన్‌షిప్‌, ఇంటర్‌ యూనివర్సిటీ స్థాయిలో ప్రాతినిధ్యం/పతకాలు గెలిచి ఉండాలి.

వయసు: 2021 సెప్టెంబరు 01 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: క్రీడల్లో సాధించిన విజయాలు, విద్యార్హతల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఫీల్డ్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తారు. వారిలో అర్హత సాధించినవారికి సూచించిన పోస్టుల ఆధారంగా డేటా ఎంట్రీ స్పీడ్‌ టెస్ట్‌, హవల్దార్‌ పోస్టులకు ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 05

వెబ్‌సైట్‌: https://dgpm.gov.in/


Tags :