Education-Article
LBSIMలో పీజీడీఎం

ఢిల్లీలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎల్‌బీఎ్‌సఐఎం)- పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు వ్యవధి రెండేళ్లు. ఏడాదికి మూడు చొప్పున మొత్తం ఆరు ట్రైమెస్టర్‌లు ఉంటాయి. ప్రోగ్రామ్‌లో భాగంగా ఎనిమిది నుంచి పది వారాల సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఈ కోర్సుకి ఏఐసీటీఈ గుర్తింపు ఉంది.


స్పెషలైజేషన్‌లు: జనరల్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, రీసెర్చ్‌ అండ్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌, ఈ - బిజినెస్‌ 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమవుతున్న వారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. వీరు డిసెంబరు 15 నాటికి మార్కుల పత్రాలు సబ్మిట్‌ చేయాలి. క్యాట్‌ 2021/ గ్జాట్‌ 2022/ జీమ్యాట్‌ (2021 అక్టోబరు 1, 2022 జనవరి 15 మధ్య నిర్వహించే టెస్ట్‌) స్కోర్‌ తప్పనిసరి.

ఎంపిక: పైన తెలిపిన జాతీయ పరీక్ష స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులను రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. జాతీయ పరీక్ష స్కోర్‌కు 60 శాతం; అకడమిక్‌ ప్రతిభ, అనుభవం, రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌ స్కోర్‌, జీడీ, ఇంటర్వ్యూలకు 40 శాతం వెయిటేజీ ఇస్తారు.  


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.1250

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 22

తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ కేంద్రం: హైదరాబాద్‌  

ప్రోగ్రామ్‌ ప్రారంభం: 2022 జూన్‌ 15 నుంచి

వెబ్‌సైట్‌: lbsim.ac.in

Tags :