Education-Article
AP CTUలో డిగ్రీ, పీజీ

విజయనగరంలోని సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ (సీటీయూ) - డిగ్రీ, పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పీజీ ప్రోగ్రామ్‌లలో నాలుగు, డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ఆరు సెమిస్టర్‌లు ఉంటాయి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒక్కో పీజీ ప్రోగ్రామ్‌లో 20 సీట్లు, ఒక్కో డిగ్రీ ప్రోగ్రామ్‌లో 30 సీట్లు ఉన్నాయి. అభ్యర్థి ప్రతిభ, కుటుంబ వార్షిక ఆదాయాలను పరిగణనలోకి తీసుకొని అర్హులకు స్కాలర్‌షిప్‌ సౌకర్యం కల్పిస్తారు. వీరు ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘జన్మభూమి స్కాలర్‌షిప్‌ పోర్టల్‌’లో ఎన్‌రోల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 


అర్హత: ఎమ్మెస్సీ (మెడిసినల్‌ కెమిస్ట్రీ)లో ప్రవేశానికి కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్‌గా బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన పీజీ ప్రోగ్రామ్‌లకు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత చాలు. డిగ్రీ స్థాయిలో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. బీఎస్సీ + ఎమ్మెస్సీ కోర్సులో జియాలజీ స్పెషలైజేషన్‌కు మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జియాలజీ సబెక్టులలో ఏవైనా మూడింటితో; బోటనీకి బైపీసీ గ్రూప్‌తో; కెమిస్ట్రీకి ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్‌/ పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. బీఎస్సీ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) కోర్సులో ప్రవేశానికి మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్‌ / పన్నెండోతరగతి లేదా పన్నెండోతరగతి(ఎంబైపీసీ) ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీకాం ఒకేషనల్‌, బీబీఏ + ఎంబీఏ ప్రోగ్రామ్‌లకు ఏదేని గ్రూప్‌తో ఇం టర్‌/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు అర్హులు. ఇంటర్‌ స్థాయిలో కనీసం 45 శాతం మార్కులు తప్పనిసరి.  

వయసు: జూలై 1 నాటికి డిగ్రీ అభ్యర్థులకు 22 ఏళ్లు, పీజీ అభ్యర్థులకు 27 ఏళ్లు మించకూడదు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌ అభ్యర్థులకు రూ.500; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 20

మెరిట్‌ జాబితా విడుదల: అక్టోబరు 23

సీట్ల అలాట్‌మెంట్‌: అక్టోబరు 25

ధృవపత్రాల పరిశీలన: అక్టోబరు 27

తరగతులు ప్రారంభం: నవంబరు 1

వెబ్‌సైట్‌: ctuap.ac.in


కోర్సులు

ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (మెడిసినల్‌ కెమిస్ట్రీ)

ఎంఏ (సోషియాలజీ/ ఇంగ్లీష్‌)

మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (ఎంఎ్‌సడబ్ల్యు)

మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ)

మాస్టర్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ (ఎంజేఎంసీ)

బీఎస్సీ (మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) + ఎమ్మెస్సీ కెమిస్ట్రీ

బీబీఏ + ఎంబీఏ (టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌)

బీఎస్సీ + ఎమ్మెస్సీ (జియాలజీ/ బోటనీ)

బీకాం ఒకేషనల్‌

బీఎస్సీ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌)


Tags :