Education-Article
ఎన్‌జీ రంగా వర్సిటీ పీజీలో ఎన్‌ఆర్‌ఐ కోటా

గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ - ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోటా కింద ఎంబీఏ (ఏబీఎం), ఎమ్మెస్సీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఒక్కో కోర్సు వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ప్రోగ్రామ్‌లో భాగంగా కోర్సు వర్క్‌లు, రీసెర్చ్‌ వర్క్‌లు, థీసిస్‌, ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌లు ఉంటాయి. అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రవాస భారతీయుల పిల్లలు, వారు స్పాన్సర్‌ చేసిన బంధువుల పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు.సీట్ల వివరాలు: అగ్రికల్చర్‌, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్‌ విభాగాల్లో మొత్తం 34 సీట్లు ఉన్నాయి. ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 5 సీట్లు ప్రత్యేకించారు. అగ్రికల్చర్‌ విభాగంలో కనీ సం రెండు సీట్లు, మిగిలిన వాటిలో ఒక్కోదానిలో కనీసం ఒక సీటు అందుబాటులో ఉంచారు. ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోటా కింద అగ్రికల్చర్‌ విభాగంలో 29 సీట్లు కేటాయించారు. బాపట్ల, తిరుపతి, నైరా, మహానంది, ఏపీజీసీ క్యాంప్‌సలలో ప్రవేశాలు పొందవచ్చు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్‌/ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ/ హోం సైన్స్‌/ కమ్యూనిటీ సైన్స్‌ విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పది పాయింట్ల స్కేల్‌ మీద కనీసం 6.5 ఓజీపీఏ సాధించి ఉండాలి. ఐఈఎల్‌టీఎస్‌/ టోఫెల్‌ సర్టిఫికెట్‌ సబ్మిట్‌ చేయాలి. ఆంగ్ల మాధ్యమంలో చదివిన భారత విద్యార్థులకు ఇవి అవసరం లేదు.


 ముఖ్య సమాచారం

కోర్సు ఫీజు: రెగ్యులర్‌ విద్యార్థులు చెల్లించే ఫీజుతోపాటు ఏడాదికి 6,000 అమెరికన్‌ డాలర్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1500

దరఖాస్తు విధానం:  వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొన్న దరఖాస్తు ఫారాన్ని నింపి ఇంటర్‌, పదోతరగతి, డిగ్రీ మార్కుల పత్రాలు; ఆరోతరగతి నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లు, డిగ్రీ కాలేజ్‌ నుంచి టీసీ, మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌,  ఎన్‌ఆర్‌ఐ వీసా - పాస్‌పోర్ట్‌ - ఆదాయం ధృవీకరణ పత్రాలు జతచేసి కింది చిరునామాకు పంపాలి. ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌  కేటగిరీకి విద్యార్థి తల్లిదండ్రుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్‌, స్పాన్సరర్‌ ధృవీకరణ పత్రం కూడా సబ్మిట్‌ చేయాలి.

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: అక్టోబరు 10

చిరునామా: రిజిస్ట్రార్‌, ఆచార్య ఎన్‌జీ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, లాం, గుంటూరు - 522034

వెబ్‌సైట్‌: angrau.ac.in

Tags :