Education-Article
నిక్మర్‌లో పీజీ

పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ (నిక్మర్‌)- పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హైదరాబాద్‌ సహా పుణె, గోవా, ఎన్‌సీఆర్‌ ఢిల్లీ క్యాంప్‌సలలో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు వ్యవధి విభాగాన్ని అనుసరించి రెండేళ్లు/ ఏడాది. ఇవి ఫుల్‌ టైం ఆన్‌ క్యాంపస్‌ ప్రోగ్రామ్‌లు. కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, రియల్‌ ఎస్టేట్‌, ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విభాగాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నిక్మర్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (ఎన్‌సీఏటీ) 2022లో సాధించిన మెరిట్‌ ఆధారంగా గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి రేటింగ్‌ ఆఫ్‌ అప్లికేషన్‌ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీటిని ఆన్‌లైన్‌ మోడ్‌లో నిర్వహిస్తారు.



అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సి టీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఇం జనీరింగ్‌/ ఆర్కిటెక్చర్‌/ ప్లానింగ్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ కామర్స్‌/ ఫైనాన్స్‌/ బ్యాంకింగ్‌ మేనేజ్‌మెంట్‌/ ఎకనామిక్స్‌/ మేథమెటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ అగ్రికల్చర్‌ డిగ్రీ కోర్సులు ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌, డెవల్‌పమెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు చార్టర్డ్‌ అకౌంటెంట్‌/ కంపెనీ సెక్రటరీ/ ఐసీడబ్ల్యుఏఐ కోర్సు లు పూర్తిచేసినవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ ఓన్డ్‌ కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ కోర్సులో చేరాలంటే కుటుంబానికి సొంత కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ ఉండాలి. సంబంధిత ధృవపత్రాలు సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. హెల్త్‌, సేఫ్టీ ్క్ష ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు ఏదేని ఇంజనీరింగ్‌ డిప్లొమాతోపాటు నాలుగేళ్ల అనుభవం ఉన్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.


ఎన్‌సీఏటీ: మొత్తం 300 మార్కులకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌కు 180 మార్కులు కేటాయించారు. ఇందులో క్వాంటిటేటివ్‌ అండ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ నుంచి 72 మార్కులకు, డేటా ఇంట్రప్రిటేషన్‌ నుంచి 36 మార్కులకు, వెర్బల్‌ ్క్ష జనరల్‌ ఎబిలిటీ నుంచి 72 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. గ్రూప్‌ డిస్కషన్‌కు 20 మా ర్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూకి 30 మార్కులు, రేటింగ్‌ ఆఫ్‌ అప్లికేషన్‌కు 70 మార్కులు ప్రత్యేకించారు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: ఒక ప్రోగ్రామ్‌కు రూ.2100; రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రోగ్రామ్‌లకు రూ.2620

ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: డిసెంబరు 10

లైవ్‌ ప్రజంటేషన్‌ సెషన్‌, మాక్‌ టెస్ట్‌ తేదీ: 2022 జనవరి 2

ఎన్‌సీఏటీ 2022 తేదీలు: 2022 జనవరి 8, 9

గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలు: 2022 జనవరి 13 నుంచి 18 వరకు

ఫలితాలు విడుదల: 2022 జనవరి 22

చిరునామా: డీన్‌ - అడ్మిషన్స్‌, నిక్మర్‌, 25/1, బాలెవాడీ, ఎన్‌ఐఏ పోస్ట్‌ ఆఫీస్‌, పుణె - 411045

వెబ్‌సైట్‌: nicmar.ac.in


విభాగాలు - క్యాంపస్‌లు

రెండేళ్ల కోర్సులు:

అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌: అన్ని క్యాంప్‌సలలో అందుబాటులో ఉంది

ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌: పుణె, హైదరాబాద్‌ 

రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌: పుణె 

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌, డెవల్‌పమెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌: పుణె 


ఏడాది కోర్సులు:

మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ ఓన్డ్‌ కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌: పుణె

క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌: పుణె, హైదరాబాద్‌

హెల్త్‌, సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌: హైదరాబాద్‌

కన్‌స్ట్రక్షన్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌: హైదరాబాద్‌

Tags :