Education-Article
హెచ్‌పీయూ సిమ్లాలో ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు

హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన  హిమాచల్‌ ప్రదేశ్‌ యూనివర్సిటీ(హెచ్‌పీయూ) ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వొకేషనల్‌ స్టడీస్‌  2021-22 విద్యా సంవత్సరానికి గాను  వివిధ కోర్సుల్లో  ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


కోర్సులు

మాస్టర్‌ ఇన్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంటీటీఎం)

వ్యవధి: రెండేళ్లు

సీట్ల సంఖ్య: 50

అర్హత: కనీసం 50 శాతం    మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే చాలు.  ఈ ఏడాది డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: బాలురు 26 ఏళ్లు, బాలికలు 28 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ ఇతర రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా. పరీక్ష విధానం: రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్న పత్రంలో 150 మల్టిపుల్‌ చాయిస్‌ కొశ్చన్స్‌ ఉంటాయి. 


జనరల్‌ నాలెడ్జ్‌ (జనరల్‌, టూరిజం బేస్డ్‌), ఇంగ్లీష్‌, రీజనింగ్‌, క్వాంటిటేటీవ్‌, డేటా ఇంట్రప్రిటేషన్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇక మార్కుల విభజన విషయానికొస్తే... రాత పరీక్షకు 50, గ్రూప్‌ డిస్కషన్‌కు 10, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 10, అకడమిక్‌ మెరిట్‌కు 30(పదో తరతికి 10, ఇంటర్మీడియట్‌కు 10, డిగ్రీకి 10) మార్కుల కేటాయించారు.


ఫైవ్‌ ఇయర్స్‌ ఇంటిగ్రేటెడ్‌ కోర్స్‌ ఇన్‌ టూరిజం అండ్‌ 

ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌(ఎ్‌ఫవైఐసీటీటీఎం) 

వ్యవధి: ఐదేళ్లు, పది సెమిస్టర్లు ఉంటాయి. మొదటి మూడేళ్లు అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సునకు సంబంధించింది. ఈ మూడేళ్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(టూరిజం అండ్‌ ట్రావెల్‌) డిగ్రీని యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. మిగిలిన రెండేళ్ల కోర్సును కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటే మాస్టర్‌ డిగ్రీ ఇన్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌(ఎంటీటీఎం) పట్టాను బహూకరిస్తారు.

మొత్తం సీట్ల సంఖ్య: 35

వయసు: 2021 జూలై 1 నాటికి 22 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ ఇతర రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా. 

పరీక్ష: రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్న పత్రంలో 150 మల్టిపుల్‌ చాయిస్‌ కొశ్చన్స్‌ ఉంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌(జనరల్‌, టూరిజం బేస్డ్‌), ఇంగ్లీష్‌, రీజనింగ్‌, క్వాంటిటేటీవ్‌, డేటా ఇంట్రప్రిటేషన్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.


బ్యాచిలర్‌ ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌(బీహెచ్‌ఎం)

కోర్సు వ్యవధి: మూడేళ్లు, ఆరు సెమిస్టర్లు

సీట్ల సంఖ్య: 40

ఎంపిక విధానం: ఇంటర్మీడియట్‌లో సాధించిన మార్కులు, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2021 జూన్‌ 21

వెబ్‌సైట్‌:  https://admissions.hpushimla.in/Instructions/MTTM.pdf

Tags :