Education-Article
ఐజీడీటీయూడబ్ల్యులో పీజీ, పీహెచ్‌డీ

ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్‌ యూనివర్సిటీ ఫర్‌ విమెన్‌ (ఐజీడీటీయూడబ్ల్యూ)ఢిల్లీ- పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాములలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పీజీ కోర్సులకు అభ్యర్థుల వయసు సెప్టెంబరు 30 నాటికి 40 ఏళ్లు మించకూడదు. పీహెచ్‌డీ ప్రవేశానికి వయోపరిమితి నిబంధనలు లేవు. ఆసక్తిగల మహిళలు జూన్‌ 30 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంటెక్‌: రెండేళ్ల వ్యవధి గల ఈ కోర్సులో మొత్తం 129 సీట్లు ఉన్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌ (ఆర్టిఫీషియ ల్‌ ఇంటెలిజెన్స్‌) 33, ఐటీ(ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌) 32, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ (వీఎల్‌ఎ్‌సఐ డిజైన్‌) 32, మెకానికల్‌ ్క్ష ఆటొమేషన్‌ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటొమేషన్‌) 32 సీట్లు ఉన్నాయి.

అర్హత: స్పెషలైజేషన్‌ను అనుసరించి సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ/ ఏఎంఐఈటీఈ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంసీఏ/ ఎమ్మెస్సీ(కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ/ ఎలకా్ట్రనిక్స్‌/ ఫిజిక్స్‌/ మేథ్స్‌/ స్టాటిస్టిక్స్‌) అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపికలో గేట్‌ స్కోరు ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు.

ఎంప్లాన్‌: కోర్సు వ్యవధి రెండేళ్లు. స్పెషలైజేషన్‌ అర్బన్‌ ప్లానింగ్‌. కోర్సులో మొత్తం 26 సీట్లు ఉన్నాయి. కనీసం 60 శాతం మార్కులతో బీఆర్క్‌/ బీ ప్లానింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. బీఈ/ బీటెక్‌ (సివిల్‌ ఇంజనీరింగ్‌) పూర్తిచేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్‌ స్కోరు ఉన్నవారు/ లేనివారు అప్లయ్‌ చేసుకోవచ్చు. ముందుగా గేట్‌ స్కోరు ఉన్నవారికి తరవాత అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

పీహెచ్‌డీ: ఫుల్‌ టైమ్‌, పార్ట్‌ టైమ్‌ విధానాల్లో ఈ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది. ఫుల్‌ టైమ్‌ అభ్యర్థులకు ఫైనాన్షియల్‌ అసిస్టెన్స్‌ సౌకర్యం కల్పిస్తారు. బోధన నైపుణ్యం ఉన్నవారిని జేఆర్‌ఎ్‌ఫలుగా నియమిస్తారు. వీరికి నెలకు రూ.31,000తోపాటు హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు. ఆర్థిక సహకారం అవసరమున్న మెరిట్‌ అభ్యర్థులకు నెలకు రూ.10,000ల చొప్పున అయిదేళ్లపాటు స్టయిపెండ్‌ ఇస్తారు. ఇందుకుగాను వీరు రీసెర్చ్‌ వర్కుతోపాటు వారానికి 5/ 6 గంటలస అకడమిక్‌, అడ్మినిస్ట్రేటివ్‌ వర్కు చేయాల్సి ఉంటుంది. 

స్పెషలైజేషన్లు - సీట్లు: కంప్యూటర్‌ సైన్స్‌ 6, ఐటీ/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ 9, ఎలక్ట్రికల్‌/ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ 7, మెకానికల్‌ అండ్‌ ఆటొమేషన్‌ 8, ఫిజిక్స్‌ 3, కెమిస్ట్రీ 1, మేథ్స్‌ 1

అర్హత: ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్లకు సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌కు బీఎస్సీ డిగ్రీతోపాటు ఎంసీఏ పూర్తిచేసి ఉండాలి. సైన్స్‌ స్పెషలైజేషన్లకు సంబంధిత మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత అవసరం. పార్ట్‌ టైమ్‌ కోర్సులో ప్రవేశానికి బోధన/ పరిశోధన విభాగాల్లో కనీసం రెండేళ్ల అనుభవం అవసరం.

ఎంపిక: అభ్యర్థులు రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు రాయాల్సి ఉంటుంది. ఇందులో 50 శాతం ప్రశ్నలను రీసెర్చ్‌ మెథడాలజీ నుంచి, మిగిలిన ప్రశ్నలను సంబంధిత సబ్జెక్టు నుంచి అడుగుతారు. ఈ పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించినవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చే స్తారు. సంస్థలో ఫుల్‌ టైమ్‌ బోధన సిబ్బందిగా పనిచేస్తున్నవారు, స్పాన్సర్డ్‌ అభ్యర్థులు, యూజీసీ- సీఎ్‌సఐఆర్‌ జేఆర్‌ఎఫ్‌ / నెట్‌ / గేట్‌ వ్యాలిడ్‌ స్కోరు ఉన్న అభ్యర్థులు రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు రాయనవసరం లేదు. వీరిని నేరుగా ఇంటర్వ్యూకి అనుమతిస్తారు.  


ఎంటెక్‌, ఎంప్లాన్‌ అభ్యర్థులకు సమాచారం

స్కాలర్‌షిప్‌: గేట్‌ అభ్యర్థులకు యూజీసీ నిబంధనల ప్రకారం; నాన్‌ గేట్‌ అభ్యర్థులకు నెలకు రూ.7,500ల నగదు ఇస్తారు.

మొదటి కౌన్సిలింగ్‌: జూలై 15

మొదటి కౌన్సిలింగ్‌లో ఎంపికైన అభ్యర్థులు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీలు: జూలై 19 నుంచి 21 వరకు

రెండో కౌన్సిలింగ్‌: జూలై 24

రెండో కౌన్సిలింగ్‌లో ఎంపికైనవారు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీలు: జూలై 24 నుంచి 27 వరకు


ఎంసీఏ: రెండేళ్ల వ్యవధిగల ఈ కోర్సులో 76 సీట్లు ఉన్నాయి. మేథమెటిక్స్‌ ప్రధాన సబ్జెక్టుగా  ప్రథమ శ్రేణి మార్కులతో ఇంటర్‌/ పన్నెండోతరగతి, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బీసీఏ/ బీఐటీ/ బీఐఎస్‌ కోర్సులు పూర్తిచేసినవారు కూడా అర్హులే. సంస్థ నిర్వహించే కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు ద్వారా అభ్యర్థులకు ప్రవేశం కల్పిస్తారు. సీట్లు మిగిలిన పక్షంలో ఎన్‌ఐఎంసీఈటీ స్కోరు ఉన్న వారికి అవకాశం ఇస్తారు.


ముఖ్య సమాచారం

కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టుకు ఎంపికైనవారి జాబితా విడుదల: జూలై 7

ఎంట్రెన్స్‌ టెస్టు తేదీ: జూలై 10/ 11

మొదటి కౌన్సిలింగ్‌: జూలై 15

రెండో కౌన్సిలింగ్‌: జూలై 24


ముఖ్య సమాచారం

రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు తేదీ: జూలై 10/ 11

ఫలితాలు విడుదల: జూలై 15

ఇంటర్వ్యూకి ఎంపికైనవారి జాబితా విడుదల: జూలై 16/ 17

ఇంటర్వ్యూలు: జూలై 19 నుంచి 22 వరకు

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: 

జూలై 28 అడ్మిషన్‌ ప్రక్రియకు చివరి తేదీ: జూలై 31

దరఖాస్తు ఫీజు రూ.1000  


Tags :