Education-Article
14 నుంచి ‘స్టాఫ్‌నర్స్‌’ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 14 నుంచి 21 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. రోజుకు సగటున 200 మందికి హైదరాబాద్‌లోని ప్రజారోగ్య సంచాలకుడి కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని, ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించింది.  అందరికీ కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లను అందజేస్తామని స్పష్టం చేసింది. కాగా, రాతపరీక్ష, సర్వీస్‌ వెయిటేజీ మార్కుల్లో మెరిట్‌ ఆధారంగా 2,418 మంది అభ్యర్థులను స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు టీఎ్‌సపీఎస్సీ ఎంపిక చేసింది. ఎంపిక జాబితాను వైద్యఆరోగ్యశాఖకు అందజేసింది. 

Tags :