Education-Article
15 నుంచి విద్యార్థులకు బస్‌ పాస్లు

10 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

గ్రేటర్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

విద్యాసంస్థలకు ప్రత్యేక కోడ్‌ నంబర్లు


హైదరాబాద్‌ సిటీ: విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా స్టూడెంట్‌ బస్‌ పాస్ లు జారీచేసేందుకు గ్రేటర్‌ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్రీ, రూట్‌, స్టూడెంట్‌ జనరల్‌, స్పెషల్‌, డిస్ర్టిక్‌ రూట్‌పాసులు తీసుకునేందుకు http-s://on-l-ine.t-s-rt-c-pa-s-s ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. జూన్‌ 10 నుంచి ఆన్‌లైన్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, జూన్‌ 15 నుంచి విద్యార్థులకు బస్‌పా్‌సలు జారీచేస్తామని గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. అడ్మినిస్ర్టేటివ్‌ ఫీజు చెల్లించిన విద్యాసంస్థల విద్యార్థులకు మాత్రమే బస్‌పా్‌సలు మంజూరు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు అడ్మినిస్ట్రేటివ్‌ చార్జీలు మినహాయింపునిచ్చారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు గ్రేటర్‌లోని అఫ్జల్‌గంజ్‌, ఆరాంఘర్‌, సీబీఎస్‌, చార్మినార్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఈసీఐఎల్‌ఎక్స్‌ రోడ్‌, ఫారూఖ్‌నగర్‌, జీహెచ్‌ఎంసీ హెడ్‌ఆఫీస్‌, ఘట్‌కేసర్‌, హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, జేబీఎస్‌, కాచిగూడతోపాటు గ్రేటర్‌లోని 37 బస్‌ కేంద్రాల్లో బస్‌ పాసులు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. 

Tags :