Education-Article
గ్రూప్‌-1 అభ్యర్థుల ఆరోగ్య పరీక్షకు మెడికల్‌ బోర్డు

అమరావతి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు గుంటూరు జనరల్‌ ఆస్పత్రిలో మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేశారు. గ్రూప్‌-1 రాతపరీక్షలో ఎంపికైన 326 మంది ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంది. ఈ ఇంటర్వ్యూలు జూన్‌ 17 నుంచి జూలై 9 వరకు ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులందరినీ వారి వారి ఇంటర్వ్యూలకు ఒక రోజు ముందే ఆరోగ్య పరీక్షలు చేసేందుకు వీలుగా మెడికల్‌ బోర్డు ఏర్పాట ుచేయాలని ఏపీపీఎస్సీ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం ఆమేరకు గుంటూరు జనరల్‌ ఆస్పత్రిలో మెడికల్‌ బోర్డు ఏర్పాటుకు అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

Tags :