Education-Article
జాతీయ విద్యావిధానంపై అపోహలొద్దు: సురేశ్‌

అమరావతి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): ‘‘జాతీయ విద్యావిధానం అమలు సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఉపాధ్యాయులు దీనిపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. టీచర్ల నుంచి సూచనలు, ఉపాధ్యాయ సంఘాల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలని ఇప్పటికే పాఠశాల విద్య డైరెక్టర్‌ను ఆదేశించాం’’ అని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యా సంస్కరణల్లో భాగంగా తీసుకుంటున్న కొన్ని చర్యలపై ఉపాధ్యాయులు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం వీటి అమలుపై చర్యలు పరిశీలన దశలోనే ఉన్నాయన్నారు. త్వరలో పరిస్థితిని బట్టి భౌతికంగా లేదా వర్చువల్‌ విధానంలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, వారి సూచనలు పరిశీలిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Tags :