Education-Article
ప్రైవేటు యూనివర్సిటీల్లో ఆరేళ్ల బీటెక్‌

ముంబయి, జూన్‌ 7: ప్రైవేటు యూనివర్సిటీలు పదో తరగతి పూర్తి చేసుకొన్న విద్యార్థుల కోసం ఆరేళ్ల ఇంటెగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులను ప్రారంభిస్తున్నాయి. పుణెలోని ఎంఐటీ-వరల్డ్‌ పీస్‌, ముంబయిలోని నార్సీ మోంజీ, గుజరాత్‌లోని గణపత్‌ వర్సిటీలు ఈ తరహా కోర్సులను అందిస్తున్నాయి.  ఆయా వర్సిటీలు విభిన్న కోర్సులను ప్రవేశపెడుతున్నాయని ఏఐసీటీఈ మాజీ ఛైర్మన్‌ ఎస్‌.ఎ్‌స.మంథా అన్నారు.


తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆరేళ్ల ఇంటెగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ సంస్థల్లో, బాసరలో ఏర్పాటుచేసిన ట్రిపుల్‌ ఐటీ, ఏపీలోని నూజివీడు, కడప, ఒంగోలు, శ్రీకాకుళంలో ఉన్న ట్రిపుల్‌ ఐటీల్లో ఆరేళ్ల బీటెక్‌ చదవొచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్‌ చదివిన వారికే వీటిలో ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రైవేటు వర్సిటీలూ ప్రారంభిస్తే ఇతర విద్యార్థులకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

Tags :