Education-Article
ఎస్‌వీఎన్‌ఐటీలో పీహెచ్‌డీ

సూరత్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎస్‌వీఎన్‌ఐటీ) - ఇంజనీరింగ్‌, సైన్స్‌ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫుల్‌ టైమ్‌, పార్ట్‌ టైమ్‌ విధానాల్లో కోర్సు అందుబాటులో ఉంది. ఏ విధానంలోనైనా కోర్సు కనిష్ఠ వ్యవధి మూడేళ్లు. గరిష్ఠ వ్యవధి ఏడేళ్లు. ఫుల్‌ టైమ్‌ అభ్యర్థులకు అయిదేళ్లపాటు ఫెలోషిప్‌/ అసిస్టెంట్‌షిప్‌ సౌకర్యం కల్పిస్తారు. రాత పరీక్ష, ప్రెజెంటేషన్‌, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

స్పెషలైజేషన్లు: సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కెమికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేనేజ్‌మెంట్‌, ఇంగ్లీష్‌.

కోర్సు వివరాలు: ఈ ప్రోగ్రాములో విభాగాన్ని అనుసరించి కోర్సు వర్కులు, సెమినార్లు ఉంటాయి. వీటిని పూర్తిచేస్తే క్రెడిట్‌ పాయింట్స్‌ ఇస్తారు. పీజీ అభ్యర్థులు మొదటి రెండు సెమిస్టర్లు పూర్తయ్యే నాటికి కనీసం 16 క్రెడిట్‌ పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. బీఈ/ బీటెక్‌ అభ్యర్థులయితే 38 క్రెడిట్స్‌ సాధించాలి. తరవాత కనీసం మూడు థియరీ కోర్సులకు అభ్యర్థులు రిజిస్టరు చేసుకోవాలి. వీటిలో ఒకటి కచ్చితంగా రీసెర్చ్‌ మెథడాలజీకి సంబంధించి ఉండాలి.

అర్హత: ఇంజనీరింగ్‌, సైన్సెస్‌, ఇంగ్లీష్‌, మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంచుకొన్న స్పెషలైజేషన్‌ను అనుసరించి గేట్‌/నెట్‌/క్యాట్‌ అర్హత పొంది ఉండాలి. 10 పాయింట్స్‌ స్కేల్‌ మీద 8 సీజీపీఏ సాధించిన బీఈ/ బీటెక్‌ అభ్యర్థులు,  గేట్‌ వ్యాలిడ్‌ స్కోరులో టాప్‌ 15లో నిలిచినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.2000 (దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1500)

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 18

రాత పరీక్ష తేదీ: జూలై 19

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు: జూలై 20

ఎంపికైనవారి జాబితా విడుదల: ఆగస్టు 2

కోర్సు ప్రారంభం: ఆగస్టు 31 నుంచి

వెబ్‌సైట్‌: svnit.ac.in

Tags :