Education-Article
ఏపీ కస్తూర్బా విద్యాలయాల్లో అడ్మిషన్స్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమగ్ర శిక్ష పథకం కింద కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో మొత్తం 352 విద్యాలయాలు ఉన్నాయి. ఆరోతరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరం (పదకొండో తరగతి)లో చేరేందుకు బాలికలకు ప్రవేశ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఏడు, ఎనిమిది తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకోసం కూడా దరఖాస్తులు కోరుతున్నారు. అనాథలు, వీధి బాలలు, బడి మానేసిన పిల్లలు సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్‌ వర్గాలకు చెందిన ఆడపిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: ఆరోతరగతిలో ప్రవేశానికి అయిదో తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరం (పదకొండో తరగతి) ప్రవేశానికి పదోతరగతి ఉత్తీర్ణత అవసరం. ఏడు, ఎనిమిది తరగతుల్లో ప్రవేశానికి ఆరు, ఏడు తరగతులు పాసై ఉండాలి. ప్రస్తుతం కేజీబీవీల్లో పదోతరగతి చదివిన బాలికలు కూడా పదకొండో తరగతి ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌ దరఖాస్తులు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. వీటిని పరిశీలించి లిస్టు రూపొందిస్తారు. ఎంపికైనవారికి ఫోన్‌ ద్వారా సమాచారమిస్తారు. సంబంధిత పాఠశాల నోటీస్‌ బోర్డులో కూడా చూడవచ్చు.


ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 20

ఏపీసీఎ్‌ఫఎ్‌సఎస్‌ నుంచి దరఖాస్తుల లిస్టు విడుదల: జూన్‌ 22

దరఖాస్తుల పరిశీలన: జూన్‌ 23, 24

ఎంపికైన బాలికల జాబితా విడుదల: జూన్‌ 25

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌: జూన్‌ 25 నుంచి 30 వరకు

సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్లు: 9494383617, 9441270099

వెబ్‌సైట్‌: apkgbv.apcfss.in

Tags :