Education-Article
టాప్‌ బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశానికి.. ఏటీఎంఏ జూలై సెషన్‌ పరీక్ష

ఏఐఎంఎస్‌ టెస్ట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్స్‌(ఏటీఎంఏ) 2021 జూలై సెషన్‌ పరీక్ష నోటిఫికేషన్‌ను అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్స్‌(ఏఐఎంఎస్‌) విడుదల చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ఐఐఎంలు, ఐఎ్‌సబీ, గ్జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఎండీఐ, ఎస్‌పీ జైన్‌, ఇక్ఫాయ్‌, ఎన్‌ఎంఐఎంఎస్‌ వంటి టాప్‌ మేనేజ్‌మెంట్‌ స్కూళ్లలో ఎంబీఏ/పీజీడీఎం/ఎంఎంఎస్‌ /ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. 


అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీఏ పూర్తయిన వారూ దరఖాస్తుకు అర్హులే.

ఎంపిక: ఏఐ అండ్‌ లైవ్‌ హ్యూమన్‌ ప్రొక్టోర్డ్‌ హోం బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఇందుకోసం అభ్యర్థులు ఇంట్లో సొంత కంప్యూటర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌క్యామ్‌తో కూడిన డెస్క్‌టాప్‌ లేదా ల్యాప్‌టాప్‌ ఉండాలి. కనీసం 1 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ కలిగిన వైఫై ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలి. పరీక్ష కంటే రెండు రోజుల ముందుగానే అభ్యర్థుల మాక్‌ టెస్ట్‌/డ్రైరన్‌లో పాల్గొనొచ్చు.

పరీక్ష స్వరూపం- ప్రిపరేషన్‌ విధానం: పరీక్ష మల్టిపుల్‌ చాయిస్‌ రూపంలో ఉంటుంది. మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రశ్న పత్రంలో ఆరు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌కు 30 నిమిషాల సమయం కేటాయించారు. అనలిటికల్‌ రీజనింగ్‌, వెర్బల్‌, కాంటిటేటివ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ఆయా విభాగాలపై అభ్యర్థులకు ఉన్న స్కిల్స్‌ని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే క్యాట్‌, ఎన్‌మ్యాట్‌, గ్జాట్‌ పరీక్షల మాదిరిగానే ఈ పరీక్ష కూడా ఉంటుంది. కాబట్టి సిలబ్‌సను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు ప్రాక్టీస్‌ చేయాలి. ముఖ్యంగా డేటా సఫిషియెన్సీ, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, డేటా అనాల్సిస్‌, కోడింగ్‌ అండ్‌ డీకోడింగ్‌, డేట్‌, టైమ్‌ అండ్‌ అరేంజ్‌మెంట్‌ నుంచి ఎక్కువగా ప్రశ్నలు ఇస్తారు. కాన్సె్‌ప్ట్సపైన పట్టుసాధించాలి. అప్పుడే ఎలాంటి క్లిష్టతరమైన ప్రశ్నకైనా సమాధానం గుర్తించడం తేలికవుతుంది. 


సీటింగ్‌ అరెంజ్‌మెంట్స్‌, కోడింగ్‌, డీకోడింగ్‌ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు రెగ్యులర్‌గా అన్ని జాతీయ స్థాయి పోటీ  పరీక్షల్లో అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు వీటికి సంబంధించి గత ప్రశ్న పత్రాలను సాధన చేస్తే సరిపోతుంది. అదేవిధంగా పరీక్షలో సమయం కూడా ముఖ్యమైనదే కాబట్టి ఎక్కువగా షార్ట్‌కట్స్‌ మెథడ్స్‌ను ఉపయోగించడం నేర్చుకోవాలి.

ముఖ్యంగా బేసిక్‌ మేథమెటికల్‌ స్కిల్స్‌ని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు పదో తరగతి స్థాయి గణిత పాఠ్యపుస్తకాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. రేషియోస్‌ అండ్‌ ప్రపోర్షన్స్‌ , ఎల్‌సిఎం, జిసిడి, పర్సంటేజ్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, టైమ్‌, డిస్టెన్స్‌ అండ్‌ వర్క్‌ ప్రాబ్లమ్‌, వాల్యూమ్స్‌, రిలేషన్స్‌ అండ్‌ ఫంక్షన్స్‌, మీడియన్‌, మోడ్‌, స్టాండర్డ్‌ డీవియేషన్స్‌ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.  బేసిక్‌ అల్గరిథమ్‌ పైన మంచి అవగాహన ఉన్నప్పుడే మేథమెటికల్‌ ఎబిలిటీలోని కాంప్రహెన్షన్‌, ఇంట్రప్రిటేషన్‌ ప్రశ్నల్లో ఏమి అడిగారు, ఎలా సాధించాలి అనే స్పష్టత వస్తుంది.


ముఖ్య సమాచారం:

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జూలై 17

రిజిస్ట్రేషన్‌కి చివరి తేదీ: 2021 జూలై 18

అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: 2021 జూలై 21

పరీక్ష తేదీ: 2021 జూలై 25

ఫలితాల విడుదల: 2021 జూలై 30

వెబ్‌సైట్‌: https://atmaaims.com/


Tags :