Education-Article
గోవా ఐఐటీలో పీహెచ్‌డీ

గోవాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)- పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెగ్యులర్‌ (ఫుల్‌ టైమ్‌), పార్ట్‌ టైమ్‌ విధానాల్లో ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది. అకడమిక్‌ ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. సంబంధిత సమాచారాన్ని అభ్యర్థులకు ఈమెయిల్‌ ద్వారా తెలియజేస్తారు.  

రెగ్యులర్‌ పీహెచ్‌డీ స్పెషలైజేషన్లు: కెమికల్‌ అండ్‌ మెటీరియల్‌ సైన్సెస్‌, ఎలక్ట్రికల్‌ సైన్సెస్‌, మేథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, పార్ట్‌ టైమ్‌ పీహెచ్‌డీ స్పెషలైజేషన్లు: ఎలక్ట్రికల్‌ సైన్సెస్‌, మెకానికల్‌ సైన్సెస్‌.

అర్హత: ఇంజనీరింగ్‌ విభాగాలకు ప్రథమ శ్రేణి మార్కులతో సంబంధిత మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 70 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌/ ఎమ్మెస్సీ (ఇంజనీరింగ్‌) పూర్తిచేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్‌ విభాగాలకు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత అవసరం.  గేట్‌ వ్యాలిడ్‌ స్కోరు ఉండాలి. సీఎ్‌సఐఆర్‌/ యూజీసీ/ ఎన్‌బీహెచ్‌ఎం/ డీబీటీ/ ఐసీఏఆర్‌/ ఐసీఎంఆర్‌/ ఐసీపీఆర్‌/ డీఎ్‌సటీ/ ఇన్‌స్పయిర్‌ ఫెలోషిప్‌ అర్హత పొంది ఉండాలి. రెండేళ్ల ప్రొఫెషనల్‌ అనుభవం అవసరం. పార్ట్‌ టైమ్‌ పీహెచ్‌డీకి పై అర్హతలతో పాటు నిర్ధేశిత అనుభవం అవసరం. మా స్టర్స్‌ డిగ్రీతోపాటు రెండేళ్లు, బీఈ/ బీటెక్‌తోపాటు నాలుగేళ్ల అనుభవం అవసరం. ఐఐటీ/ఐసర్‌/ఐఐఐటీ ఐఐఎస్సీ/నిట్‌ సంస్థలనుంచి 80 శాతం మార్కులతో మాస్టర్స్‌/ ఇంజనీరింగ్‌ డిగ్రీ చేసినవారికి ఏడాది అనుభవం చాలు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.100 (మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50)

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 15 

వెబ్‌సైట్‌: iitgoa.ac.in


Tags :