Education-Article
కేఐఐటీలో బ్యాచిలర్స్‌, మాస్టర్స్‌ ప్రోగ్రాములు

భువనేశ్వర్‌(ఒడిషా)లోని కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ(కేఐఐటీ) 2021 విద్యా సంవత్సరానికి గాను వివిధ బ్యాచిలర్స్‌, మాస్టర్స్‌  ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహించి అర్హులకు సీట్లను కేటాయిస్తారు.


బ్యాచిలర్స్‌ ప్రోగాములు: 

బీటెక్‌, బీటెక్‌(లేటరల్‌ ఎంట్రీ), బీఎస్సీ(నర్సింగ్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌, బీఏ ఎల్‌ఎల్‌బి, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ప్రొడక్షన్‌, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీఏ, బీకాం.


మాస్టర్స్‌ ప్రోగాములు: ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంసీఏ, ఎంకాం, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ అండ్‌ పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌ఎం, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ అండ్‌  పీహెచ్‌డీ, ఎంఆర్క్‌, మాస్టర్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, ఎంబీఏ, పీహెచ్‌డీ తదితరాలు.


బీటెక్‌(నాలుగేళ్లు)/ బీటెక్‌ అండ్‌ ఎంటెక్‌

(డ్యుయల్‌ డిగ్రీ) (బయోటెక్నాలజీ) 

(ఐదేళు)్ల: 2019, 2020 విద్యా సంవత్సరాల్లో ఇంటర్‌ ఉత్తీర్ణులై లేదా ఈ ఏడాది చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న సైన్స్‌ గ్రూపు (ఎంపీసీ/బైపీసీ) విద్యార్థులెవరైనా  దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే బీటెక్‌(నాలుగేళ్లు), బీటెక్‌ అండ్‌ ఎంటెక్‌(డ్యుయల్‌ డిగ్రీ) కోర్సులకు ఇంటర్‌లో ఎంపీసీ (మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) చదివి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇక బీటెక్‌ అండ్‌ ఎంటెక్‌(డ్యుయల్‌ డిగ్రీ) (బయోటెక్నాలజీ) కోర్సుకు మాత్రం ఫిజిక్స్‌, కెమిస్ట్రీ/ బయాలజీ/ బయోటెక్నాలజీ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 

బీటెక్‌ లేటరల్‌ ఎంట్రీ(మూడేళ్లు): కనీసం 60 శాతం మార్కులతో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 

బీబీఏ(మూడేళ్లు): 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. అయితే ఇంటర్‌లో మేథ్స్‌/బిజినెస్‌ మేథమెటిక్స్‌/ఎకనామిక్స్‌/స్టాటిస్టిక్స్‌లలో ఒక సబ్జెక్టులను తప్పనిసరిగా చదివి ఉండాలి.  

బీసీఏ(మూడేళ్లు): మేథమెటిక్స్‌ ఒక సబ్జెక్టుగా 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత.  

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(ఫ్యాషన్‌/టెక్స్‌టైల్‌) (నాలుగేళ్లు): 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. 

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ప్రొడక్షన్‌

(మూడేళ్లు): 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. 

మాస్టర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌(ఇంటిగ్రేటెడ్‌)(అయిదేళ్లు): 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. 

బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌(మూడేళ్లు): మేథ్స్‌ ఒక సబ్జెక్టుగా 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. అభ్యర్థులు 2000 జూలై 1న గానీ ఆ తర్వాత గానీ జన్మించి ఉండాలి. బీఏ ఎకనామిక్స్‌(ఆనర్స్‌)(మూడేళ్లు); బీఏ ఇంగ్లీష్‌ (ఆనర్స్‌)(మూడేళ్లు); బీఏ(సోషియాలజీ)(ఆనర్స్‌) (మూడేళ్లు); బీఏ సోషియాలజీ/సైకాలజీ(మూడేళ్లు) కోర్సులకు 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. 

బీకాం(మూడేళ్లు): 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. అయితే ఇంటర్‌లో మేథ్స్‌/బిజినెస్‌ మేథమెటిక్స్‌/ఎకనామిక్స్‌/స్టాటిస్టిక్స్‌లలో ఒక సబ్జెక్టులను తప్పనిసరిగా చదివి ఉండాలి. 

మాస్టర్స్‌ ప్రోగాములు: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక: కేఐఐటీఈఈ-2021 ఆన్‌లైన్‌ టెస్ట్‌ ద్వారా

పరీక్ష విధానం: ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్‌ టైప్‌ విధానంలో ఉంటుంది. మొత్తం నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 4 నాలుగు మార్కులు కేటాయించారు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. సమాధానాన్ని తప్పుగా గుర్తించిన ప్రశ్నకు ఒక మార్కు కట్‌ చేస్తారు. ఈ టెస్ట్‌ను ఇంగ్లీష్‌ మాధ్యమంలోనే నిర్వహిస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తుకు చివరి తేదీ: 2021 జూన్‌ 11

వెబ్‌సైట్‌: kiitee.kiit.ac.in/

Tags :