Education-Article
ఐఐఎం రోహ్‌తక్‌లో ఈపీడీజీఎస్‌ఎం

రోహ్‌తక్‌(హరియాణాలోని) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) 2021-23 విద్యా సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌(ఈపీడీజీఎ్‌సఎం) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. అనుభవజ్ఞులైన మేనేజ్‌మెంట్‌ నిపుణులు, క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవారు, క్రీడా రంగంలోని అడ్మినిస్ట్రేటర్లు, అన్నిటికీ మించి స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌లో రాణించాలనుకునే వారి కోసం ఈ కోర్సును ఉద్దేశించారు.


ఈ కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. ఈపీడీజీఎ్‌సఎంని విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి యూకేలోని అల్స్‌టర్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఇన్‌ స్పోర్ట్స్‌ డిగ్రీ చదివే అవకాశం లభిస్తుంది. కోర్సులో భాగంగా అభ్యర్థులు ఐదు నెలల వ్యవధిలో 60 క్రెడిట్స్‌తో కూడిన స్పోర్ట్స్‌ కన్సల్టెన్సీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా ప్రఖ్యాత సంస్థలైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌, అల్స్‌టర్‌ యూనివర్సిటీ(యూకే), లీడ్స్‌ బెకెట్‌ యూనివర్సిటీ(యూకే), జ్యురిచ్‌ యూనివర్సిటీ(స్విట్జర్లాండ్‌), యూనివర్సిటీ ఆఫ్‌ పోర్టో(పోర్చుగల్‌), బ్రిటిష్‌ కొలంబియా ఇన్‌స్టిట్యూట్‌(కెనడా), యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకి(ఫిన్లాండ్‌), యూనివర్సిటీ ఆఫ్‌ శాన్‌ఫ్రాన్సిస్కో(యూఎస్‌) తదితర వర్సిటీలకు చెందిన ఫ్యాకల్టీ ఐఐఎం రోహ్‌తక్‌కు విచ్చేసి ఈపీడీజీఎ్‌సఎం విద్యార్థులకు బోధిస్తారు.


రెండేళ్ల వ్యవధిగల ఈ కోర్సులో మొత్తం ఆరు టర్మ్‌లు ఉంటాయి. మొదటి టర్మ్‌ 2021 సెప్టెంబరు నుంచి 2021 డిసెంబరు వరకు ఉంటుంది. రెండో టర్మ్‌ 2022 జనవరి నుంచి 2022 ఏప్రిల్‌ వరకు, మూడో టర్మ్‌ 2022 ఏప్రిల్‌ నుంచి 2022 జూన్‌ వరకు, నాలుగో టర్మ్‌ 2022 జూన్‌ నుంచి 2022 అక్టోబరు వరకు, ఐదో టర్మ్‌ 2022 అక్టోబరు నుంచి 2023 జనవరి వరకు, ఆరో టర్మ్‌ 2023 జనవరి నుంచి 2023 ఏప్రిల్‌ వరకు కొనసాగుతాయి. ఇక తరగతుల విషయానికొస్తే ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ రెండు విధాలుగా నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్‌ సెషన్స్‌, ఆన్‌లైన్‌ సెషన్స్‌, లైవ్‌ ప్రాజెక్ట్స్‌, ఇండస్ట్రియల్‌ విజిట్స్‌ను కలుపుకొంటే మొత్తం 560 ఇంటరాక్టివ్‌ సెషన్స్‌ను కోర్సు పూర్తయ్యేలోగా నిర్వహిస్తారు. ప్రతి సెషన్‌ ఒక గంట 15 నిమిషాల చొప్పున మొత్తం అన్ని సెషన్లకు కలిపి 900 గంటల సమయాన్ని కేటాయించారు. ఆరు కంపల్సరీ క్యాంపస్‌ మాడ్యుల్స్‌ ఉంటాయి. ప్రతివారం శుక్ర, శని, ఆదివారాల్లో ఆన్‌లైన్‌ క్లాసులు ఉంటాయి.

కోర్సు ఫీజు: రూ.7,15,524. ఈ ఫీజును మూడు వాయిదాల్లో చెల్లించవచ్చు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌లో ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.

ఎంపిక విధానం: స్పోర్ట్స్‌ ఆప్టిట్యూడ్‌ అసె్‌సమెంట్‌ టెస్ట్‌, ఆన్‌లైన్‌ పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: రూ.1000

దరఖాస్తుకు చివరి తేదీ: 2021 జూలై 19

స్పోర్ట్స్‌ ఆప్టిట్యూడ్‌ అసె్‌సమెంట్‌ టెస్ట్‌: 2021 జూలై 31

వెబ్‌సైట్‌:  https://www.iimrohtak.ac.in/

Tags :