Education-Article
వెస్టర్న్‌ రైల్వేలో అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్న ముంబైలోని వెస్టర్న్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటి్‌సల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడులు: ఫిట్టర్‌, వెల్డర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, పెయింటర్‌, మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలకా్ట్రనిక్స్‌ మెకానిక్‌, వైర్‌మన్‌ తదితరాలు

అర్హత: మెట్రిక్యులేషన్‌/పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 2021 జూన్‌ 4 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2021 జూన్‌ 24

వెబ్‌సైట్‌: www.rrc-wr.com/


Tags :