Education-Article
జాతీయ సంస్థల్లో ఫెలోషిప్పులు

దేశంలోని ప్రముఖ జాతీయ సంస్థలు ఫెలోషిప్పులకు దరఖాస్తులు కోరుతూ విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేశాయి. గాంధీనగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ‘ఎర్లీ కెరీర్‌ ఫెలోషిప్‌’ ప్రోగ్రామ్‌ని ప్రకటించింది. న్యూఢిల్లీలోని సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ బోర్డు (ఎస్‌ఈఆర్‌బీ) నేషనల్‌ పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషి్‌పను అందిస్తోంది.


ఐఐటీ గాంధీనగర్‌ - ఈసీఎఫ్‌ 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 2020 జనవరి 1 నాటికి పీహెచ్‌డీ పూర్తిచేసి ఉండాలి. ఇప్పటికే థీసెస్‌ సమర్పించినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అత్యుత్తమ ట్రాక్‌ రికార్డుతోపాటు పరిశోధనలకు సంబంధించిన వర్కులో గుర్తింపు పొంది ఉండాలి. పరిశోధనల పరిధిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ విద్యార్థులకు మార్గదర్వకత్వం వహించడంలో ముందుండాలి. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు, మిషన్లలో పాల్గొంటూ పరిశోధనాత్మక వ్యాసాలు రాయడంలో ఆసక్తి ఉండాలి. వ్యవస్థాపక ప్రయత్నాలు ప్రారంభించి ఉండాలి. ప్రస్తుతం కొనసాగిస్తున్న ప్రాజెక్టుకు సంబంధించి రీసెర్చ్‌ ప్లాన్‌, ప్రపోజల్‌ను దరఖాస్తుకు జతచేయాలి.

ఫెలోషిప్‌: దీని వ్యవధి ఏడాది. మరో రెండేళ్లు పెంచే అవకాశం ఉంది. ఫెలోషిప్‌ కింద నెలకు రూ.1,00,000 చెల్లిస్తారు. విదేశాల్లో సమావేశాలు, వర్క్‌షాపులు, ట్రైనింగ్‌ ప్రోగ్రాముల్లో పాల్గొనేందుకు వీలుగా ప్రొఫెషనల్‌ డెవల్‌పమెంట్‌ గ్రాంట్‌ కింద ఏడాదికి రూ.2,00,000 ఇస్తారు.


ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 7

వెబ్‌సైట్‌: iitgn.ac.in/research/early-career-fellowship


Tags :