Education-Article
ఐఐఐటీడీఎం, కర్నూలులో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖకు చెందిన కర్నూలు(ఏపీ) లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌(ఐఐఐటీడీఎం) 2021 విద్యా సంవత్సరానికి పలు ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో  (పార్ట్‌/ ఫుల్‌ టైమ్‌) ప్రవేశాలు

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లీష్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ(ఎంఈ/ ఎంటెక్‌, ఎమ్మెస్సీ, ఎంఏ) ఉత్తీర్ణత. గేట్‌/ సీఎస్‌ఐఆర్‌-నెట్‌/ ఇన్‌స్పైర్‌ ఫెలోషిప్‌ అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక: సంస్థ సూచించిన అకడమిక్‌ విద్యార్హతలు, అదనపు అర్హతలు కలిగిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులను రాతపరీక్ష/ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అకడమిక్‌ రికార్డ్‌, టెస్ట్‌/ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు ఫీజు:  జనరల్‌/ ఓబీసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.

దరఖాస్తుకు చివరితేదీ: జూన్‌ 21

వెబ్‌సైట్‌: www.iiitk.ac.in

Tags :