Education-Article
ఐహెచ్‌ఎంలో డిప్లొమాలు

హాజీపూర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐహెచ్‌ఎం) డిప్లొమా కోర్సు ల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

కోర్సులు - సీట్లు: ఫుడ్‌ ప్రొడక్షన్‌, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ సర్వీస్‌ విభాగాల్లో డిప్లొమా కోర్సు లు అందుబాటులో ఉన్నా యి. ఒక్కో కోర్సు వ్యవధి ఒకటిన్నర సంవత్సరం. కోర్సుకు 56 చొప్పున మొత్తం 112 సీట్లు ఉన్నాయి. ప్రతి కోర్సులో జనరల్‌ అభ్యర్థులకు 26, ఓబీసీలకు 15, ఎస్సీలకు 8, ఎస్టీలకు 4, ఈడబ్ల్యూఎస్‌ వర్గానికి 3 సీట్లు ప్రత్యేకించారు.


అర్హత: గుర్తింపు పొందిన బోర్డు (స్టేట్‌/ సెంట్రల్‌)నుంచి ఏదేని గ్రూపుతో ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. జూలై 1 నాటికి జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌ అభ్యర్థు ల వయసు  25 ఏళ్లు;  ఎస్సీ,  ఎస్టీ వర్గాలకు 28 ఏళ్లు మించకూడదు.


దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: జూన్‌ 7

రాత పరీక్షకు ఎంపికైన జాబితా విడుదల: జూన్‌ 14

రాత పరీక్ష తేదీ: జూన్‌ 21

ధృవపత్రాల పరిశీలన: జూలై 5 నుంచి 13 వరకు

వెబ్‌సైట్‌: ihmhajipur.net

Tags :