Education-Article
గోవా షిప్‌యార్డ్‌లో 137 ఖాళీలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన వాస్కోడిగామ(గోవా)లోని గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 137


పోస్టులు : జనరల్‌ ఫిట్టర్‌, ఎలక్ట్రికల్‌ మెకానిక్‌, కమర్షియల్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, అన్‌స్కిల్డ్‌, ఎఫ్‌ఆర్‌పీ ల్యామినేటర్‌, ఈఓటీ క్రేన్‌ ఆపరేటర్‌, వెల్డర్‌, స్ట్రక్చరల్‌ ఫిట్టర్‌, నర్సు, ట్రెయినీ కలాసి.


అర్హత: పోస్టుని అనుసరించి పదో తరగతి, ఐటీఐ/ఎన్‌సీవీటీ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ(నర్సింగ్‌), డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 2021 మార్చి 31 నాటికి 33 ఏళ్లు మించకుండా ఉండాలి

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆ్‌ఫలైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: 2021 జూన్‌ 04

చిరునామా: జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌ అండ్‌ ఏ), హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భవన్‌, గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌, వాస్కో డ గామా, గోవా-403802

వెబ్‌సైట్‌: https://goashipyard.in/

Tags :