Education-Article
పశ్చిమ గోదావరిలో వలంటీర్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామ, వార్డు వలంటీర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 539 పోస్టులు. పదోతరగతి ఉత్తీర్ణులైన స్థానికులు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా సెలెక్షన్‌ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. 


ఖాళీల వివరాలు: అత్తిలి 15, భీమవరం 46, ద్వారకా తిరుమల 9, ఏలూరు 91, ఉండ్రాజవరం 12, పెనుగొండ 8, పెదవేగి 14, జంగారెడ్డిగూడెం 17, గణపవరం 19, తణుకు 21, నర్సాపురం 9 ఖాళీలు ఉన్నాయి.


అర్హత : ప్రభుత్వ పథకాలమీద పూర్తి అవగాహన అవసరం. ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై పరిజ్ఞానం ఉండాలి.  కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ అవసరం. తెలుగు రాయడం, చదవడం తెలిసుండాలి. వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.


ఇంటర్వ్యూ : ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహనకు 25 మార్కులు; ప్రభుత్వ సంక్షేమ విభాగాలు, సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవానికి 25 మార్కులు; నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు 25 మార్కులు; సాఫ్ట్‌ స్కిల్స్‌కు 25 మార్కులు కేటాయించారు. 


ముఖ్య సమాచారం :-

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: మే 10

వెబ్‌సైట్‌: gswsvolunteer.apcfss.in

Tags :