Education-Article
ఎన్‌ఎల్‌యూలో ఎంబీఏ, పీహెచ్‌డీ

జోథ్‌పూర్‌లోని నేషనల్‌ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ) ఎంబీఏ, పీహెచ్‌డీ ప్రోగ్రాములలో ప్రవేశానికి విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 


పీహెచ్‌డీ

కోర్సు వ్యవధి మూడేళ్ల నుంచి ఆరేళ్ల వరకు ఉంటుంది.  మొత్తం 10 సీట్లు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో లా విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు చాలు. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు కూడా అర్హులే. వీరు అడ్మిషన్‌ సమయానికి మార్కుల పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. అభ్యర్థులను ప్రవేశ పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్షలో జ్యూరీ్‌సప్రూడెన్స్‌, కానిస్టిట్యూషనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ లా, పబ్లిక్‌ ఇంటర్నేషనల్‌ లా, ఇంటర్నేషనల్‌ హ్యుమానిటేరియన్‌ లా, లా ఆఫ్‌ క్రైమ్స్‌, లా ఆఫ్‌ టార్ట్స్‌ అండ్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌, కమర్షియల్‌ లా, ఫ్యామిలీ లా, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ హ్యూమన్‌ రైట్స్‌ లా, ఇంటలెక్చ్యువల్‌ ప్రాపర్టీ రైట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంపారిటివ్‌ పబ్లిక్‌ లా, సిస్టమ్స్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. షార్ట్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు, మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఇందులో అర్హత పొందాలంటే కనీసం 50 శాతం మార్కులు రావాలి. ఈ పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకి అనుమతిస్తారు. యూజీసీ నెట్‌ జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందిన అభ్యర్థులు ప్రవేశ పరీక్ష రాయనవసరం లేదు. 

దరఖాస్తు ఫారాలు వెబ్‌సైట్‌లో మే 24 వరకూ అందుబాటులో ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: రూ.2500 (ఎస్సీ, ఎస్టీలకు రూ.1500)

ఈ మెయిల్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 3

ప్రవేశ పరీక్ష తేదీ: జూన్‌ 27

ఈ మెయిల్‌: [email protected]


ఎంబీఏ

ఇన్సూరెన్స్‌ విభాగంలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. దీని వ్యవధి రెండేళ్లు. మొత్తం 40 సీట్లు ఉన్నాయి. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, దివ్యాంగులకు 5 శాతం సీట్లు ప్రత్యేకించారు.  ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్‌ అభ్యర్థులు కూడా అర్హులే. పదోతరగతి, ఇంటర్‌ స్థాయుల్లో కూడా 50 శాతం మార్కులు తప్పనిసరి. రిజర్వుడు వర్గాలవారికి 5 శాతం మినహాయింపు వర్తిస్తుంది. క్యాట్‌లో 50 శాతం/ సీమ్యాట్‌లో 160 స్కోరు/ మ్యాట్‌లో 400 కంపోజిట్‌ స్కోరు ఉండాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 15

మొదటి లిస్ట్‌ విడుదల: జూన్‌ 20

అడ్మిషన్‌ తేదీ: జూన్‌ 25

అడ్మిషన్‌ ప్రక్రియకు చివరి తేదీ: జూన్‌ 30

వెబ్‌సైట్‌: nlujodhpur.ac.in
Tags :