Education-Article
ఉన్నత విద్యపై త్వరలో విధి విధానాలు

అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): కరోనా తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధి విధానాలను బట్టి త్వరలోనే ఉన్నత విద్యపై నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. సోమవారం ఉన్నత విద్యపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి సమీక్ష నిర్వహించారు. సిలబస్‌, శిక్షణ  తరగతుల నిర్వహణపై అధికారులతో మాట్లాడారు. యూనివర్సిటీల్లో పరీక్షలు, ఆన్‌లైన్లో తరగతులు నిర్వహించడం, కొవిడ్‌ ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై మంత్రి సమీక్షించారు. 


Tags :