Education-Article
పరీక్షల వాయిదా సమష్టి విజయం: లోకేశ్‌

అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): ‘‘ఇంటర్‌ పరీక్షల వాయిదా విద్యార్థులు, తల్లిదండ్రుల సమష్టి విజయం. పోరాటానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ఆయన ఆదివారం జూమ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 20 రోజులుగా పరీక్షల వాయిదాకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చామన్నారు. కలిసికట్టుగా పోరాడడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఉద్యమంలో భాగస్వాములైన జనసేన, కమ్యూనిస్టు పార్టీలు, విద్యార్థి సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు.

Tags :