Education-Article
ఎన్‌ఐఎంఆర్‌లో పీహెచ్‌డీ

న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మలేరియా రీసెర్చ్‌ (ఎన్‌ఐఎంఆర్‌) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సుమారు 13 నుంచి 15 సీట్లు ఉన్నాయి. వెక్టర్‌ బయాలజీ, పారాసైట్‌ - హోస్ట్‌ బయాలజీ, ఎపిడిమియాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ బయాలజీ ప్రధానాంశాలుగా రీసెర్చ్‌ థీమ్‌లు రూపొందించారు. కోర్సు పూర్తిచేసుకొన్నవారికి ఏసీఎ్‌సఐఆర్‌ (అఫ్లియేట్‌ సెంటర్‌ ఆఫ్‌ ద అకాడమీ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ రీసెర్చ్‌) డిగ్రీ ప్రదానం చేస్తుంది. మహిళలకు వసతి సౌకర్యం ఉంది. స్థానికేతరులకు ప్రాధాన్యమిస్తారు. 


పరిశోధన విభాగాలు: బయో కెమిస్ట్రీ, స్ట్రక్చరల్‌ బయాలజీ, బయో స్టాటిస్టిక్స్‌, బయో ఇన్ఫర్మాటిక్స్‌, డ్రగ్‌ డిస్కవరీ - డ్రగ్‌ రెసిస్టెన్స్‌, ఎంటమాలజీ, ఎపిడిమియాలజీ, ఇమ్యూనాలజీ, మైక్రో బయాలజీ, జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బయోలాజికల్‌ సైన్సెస్‌ విభాగాల్లో ఎమ్మెస్సీ/ ఎంటెక్‌/ ఎండీ/ బీఈ/ బీటెక్‌, ఎంబీబీఎస్‌, బీఫార్మసీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు చాలు. సీఎ్‌సఐఆర్‌ - యూజీసీ నెట్‌ / ఐసీఎంఆర్‌/ డీబీటీ  


జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషి్‌ప(జేఆర్‌ఎఫ్‌) లేదా డీఎ్‌సటీ ఇన్‌స్పయిర్‌ ఫెలోషిప్‌ అర్హత పొంది ఉండాలి. దరఖాస్తు నాటికి అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి పర్సనల్‌ ఇంటర్యూలు నిర్వహించి అందులో సాధించిన మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.  


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.300(దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 20

హార్డు కాపీ చేరేందుకు చివరి తేదీ: మే 31

ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: జూన్‌ మొదటి వారంలో

ఇంటర్వ్యూలు: జూలై రెండో వారంలో

వెబ్‌సైట్‌: www.nimr.org.in

Tags :