Education-Article
ఎల్‌.ఎన్‌.మిశ్రా ఇన్‌స్టిట్యూట్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు

పట్నాలోని ‘ఎల్‌.ఎన్‌.మిశ్రా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ సోషల్‌ చేంజ్‌’.. 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటనను విడుదల చేసింది.

పీజీ కోర్సులు: ఎంబీఏ, ఎంబీఏ(ఐబీ), ఎంహెచ్‌ఆర్‌ఎం, 

ఎంబీఏ-ఎగ్జిక్యూటివ్‌, ఎంసీఏ

వ్యవధి: రెండేళ్లు

అర్హత: ఎంబీఏ, ఎంబీఏ(ఐబీ), ఎంహెచ్‌ఆర్‌ఎం కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది. మ్యాట్‌ (సెప్టెంబరు 2020 - మే 2021)/ సీమ్యాట్‌ స్కోరు ఉండాలి. ఎంబీఏ-ఎగ్జిక్యూటివ్‌ కోర్సుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు గవర్నమెంట్‌/సెమీ గవర్నమెంట్‌/ పబ్లిక్‌/ ప్రయివేట్‌ సెక్టార్‌లో పనిచేస్తూ ఉండాలి. ఎంసీఏ కోసం 50 శాతం మార్కులతో (రిజర్వుడ్‌  కేటగిరీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు) మూడేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్‌(10+2) లేదా  డిగ్రీలో  మేథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

యూజీసీ కోర్సులు: బీబీఏ, బీసీఏ

వ్యవధి: మూడేళ్లు

అర్హత: బీసీఏ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మేథ్స్‌, ఫిజిక్స్‌ ప్రధాన సబ్జెక్టులతో ఇంటర్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉండాలి. బీబీఏ కోర్సుకు 45 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులకు 40 మార్కులు సరిపాతాయి.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: ఇతరులకు రూ.15,00, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.750

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తుకు చివరి తేదీ: 2021 మే 31

వెబ్‌సైట్‌: https://lnmipat.ac.in/

Tags :