Education-Article
టెన్త్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో సహకరించండి

ఉపాధ్యాయులకు పాఠశాల విద్యా శాఖ సూచన

అమరావతి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు డిజిటల్‌ మాధ్యమాల ద్వారా సహకరించాల్సిందిగా ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వచ్చే నెల 1 నుంచి 31 వరకు వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పాఠశాల విద్యా డైరెక్టర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడు గురువారం ఈ మేరకు సూచనలు జారీచేశారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా సందేహాలు నివృత్తి చేయాలని ఆదేశించింది. జూన్‌ 1 నుంచి 5 వరకు పాఠశాలల్లో మళ్లీ రిపోర్టు చేయాలని ఉపాధ్యాయులను ఆదేశాలు ఇచ్చింది. జూన్‌లో జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని సూచించింది. పరీక్షల నిర్వహణ, విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆర్‌జేడీలను విద్యా శాఖ ఆదేశించింది. 

Tags :