Education-Article
చిన్నారిని కాపాడలేని వారు విద్యార్థులను కాపాడతారా!: సోమిరెడ్డి

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): ‘‘పరీక్షల నిర్వహణపై వైసీపీ ప్రభుత్వానికి ఇంత పంతం ఎందుకు? పట్టించుకొనే నాథుడు లేక విశాఖలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. చిన్నారులనే కాపాడలేని ప్రభుత్వం విద్యార్థులను ఏం కాపాడగలుగుతుంది?’’ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రతిపక్షాలు అడిగాయి కాబట్టి పంతంతో సీఎం పరీక్షలు పెడుతున్నారని ప్రజలు అనుకొంటున్నారు. ప్రజల కోరికనే ప్రతిపక్షాలు చెబుతాయి. మీ శక్తిని, పట్టుదలను కరోనా బాధితులకు సరైన వైద్యం అందించడంలో చూపించండి. ప్రజలు హర్షిస్తారు’’ అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. 

Tags :