Education-Article
గ్రూప్‌-1లో గోల్‌మాల్‌!

మెయిన్స్‌ ఫలితాలపై అభ్యంతరాల వెల్లువ

ఏపీపీఎస్సీకి పలువురు అభ్యర్థుల ఫిర్యాదులు

3న తగిన ఆధారాలతో రండి: కార్యదర్శి


అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. బుధవారం విడుదలైన ఫలితాల్లో గోల్‌మాల్‌ జరిగిందంటూ ఏపీపీఎస్సీ కార్యాలయానికి అభ్యర్థులు సందేశాలు పంపించారు. ఈ పరీక్షల కోసం తాము దీర్ఘకాలం సీరియ్‌సగా ప్రిపేర్‌ అయినప్పటికీ క్వాలిఫై కాలేదని, ఎంతోమంది ఆషామాషీ అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారని పలువురు ఫిర్యాదులు చేశారు. దీనిపై ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు స్పందించారు. ఏ అభ్యర్థికైనా ఫలితాలపై అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో మే 3న మధ్యాహ్నం 12 గంటలకు తనను  కలవాలని సూచించారు. కొవిడ్‌-19 ప్రొటోకాల్‌ మేరకు మాస్క్‌ ధరించి, పీపీఈ కిట్‌తో రావాలని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :