Education-Article
ఎయిమ్స్‌ మంగళగిరిలో జూనియర్‌ రెసిడెంట్లు

మంగళగిరిలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన(పీఎంఎ్‌సఎ్‌సవై) పథకం కోసం ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ రెసిడెంట్లు (నాన్‌ అకడమిక్‌), సీనియర్‌ రెసిడెంట్ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం 19 పోస్టులు ప్రకటించారు.

 

జూనియర్‌ రెసిడెంట్లు

ఖాళీలు: 15

రిజర్వేషన్‌: జనరల్‌ అభ్యర్థులకు 7, ఓబీసీలకు 3, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, ఈడబ్ల్యూఎస్‌ వర్గానికి 2 ఖాళీలు ప్రత్యేకించారు. 

అర్హత: ఇంటర్వ్యూ నాటికి ఇంటర్న్‌షిప్‌ సహా ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తిచేసి మూడేళ్లు దాటకూడదు. 2018 మే 4 నుంచి 2021 మే 3 మధ్య కోర్సు పూర్తిచేసినవారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఇంటర్వ్యూకి ముందే స్ర్కీనింగ్‌ కమిటీ ధృవ పత్రాలను పరిశీలిస్తుంది. 

వయసు: ఇంటర్వ్యూ నాటికి 33 ఏళ్లు మించకూడదు. 

ఒప్పంద వ్యవధి: ఆర్నెల్లు

వేతనం: నెలకు రూ.91,952

సీనియర్‌ రెసిడెంట్లు

ఖాళీలు: 4

విభాగాలు: మైక్రో బయాలజీ, గైనకాలజీ, రేడియాలజీ, జనరల్‌ మెడిసిన్‌/ పల్మనరీ మెడిసిన్‌

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు పీజీ డిప్లొమా /ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ పూర్తిచేసి ఉండాలి. డీఎంసీ/ ఎంసీఐ/ స్టేట్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి.

వయసు: ఇంటర్వ్యూ నాటికి 45 ఏళ్లు మించకూడదు.

ఒప్పంద వ్యవధి: 11 నెలలు

వేతనం: నెలకు రూ.1,10,000


ముఖ్య సమాచారం

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.1000(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500; దివ్యాంగులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)

ఇంటర్వ్యూలు: మే 3

వేదిక: కాన్ఫరెన్స్‌ హాల్‌, మొదటి అంతస్తు, ఓపీడీ బ్లాక్‌, ఎయిమ్స్‌ మంగళగిరి, మంగళగిరి, గుంటూరు జిల్లా

వెబ్‌సైట్‌: www.aiimsmangalagiri.edu.in

Tags :