Education-Article
ఆర్మీ కాలేజీల్లో ప్రొఫెషనల్‌ కోర్సులు

ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్‌) నిర్వహిస్తున్న ప్రొఫెషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ భిన్న కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఆర్మీ కుటుంబాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు నిర్ధేశిత వెబ్‌సైట్లు చూడవచ్చు.


ఆర్మీ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ (ఏసీఎన్‌), జలంధర్‌

ఇందులో నాలుగేళ్ల బీఎస్సీ(నర్సింగ్‌) కోర్సు అందుబాటులో ఉంది. మొత్తం 60 సీట్లు ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. ఆర్మీ కుటుంబాలకు చెందిన బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. బైపీసీ గ్రూపుతో ఇంటర్‌ ఉత్తీర్ణులు/ బీఎస్సీ(బైపీసీ) మొదటి సంవత్సరం పూర్తిచేసుకొన్నవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఇంగ్లీషు ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. డిసెంబరు 31 నాటికి 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షని గువహటీలోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నర్సింగ్‌ నిర్వహిస్తుంది. పరీక్ష సమయం 2 గంటలు. ఇందులో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్‌ విభాగాలనుంచి  మొత్తం 120 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ ఇంటర్‌/ పన్నెండో తరగతి స్థాయిలోనే ఉంటాయి. కోర్సు పూర్తిచేసుకొన్నవారికి ‘బాబా ఫరీద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌’ డిగ్రీ ప్రదానం చేస్తుంది. 

రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మే 15

అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడింగ్‌: జూన్‌ 12 నుంచి

అడ్మిషన్‌ టెస్టు తేదీ: జూన్‌ 27   

ఫలితాలు విడుదల: జూలై 11

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌: www.ainguwahati.org

వెబ్‌సైట్‌: www.acn.co.in


ఆర్మీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లా (ఏఐఎల్‌), మొహాలీ

ఇందులో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు(బీఏ-ఎల్‌ఎల్‌బీ), ఏడాది వ్యవధి గల ఎల్‌ఎల్‌ఎం కోర్సు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో 80 సీట్లు ఉన్నాయి. వీటిలో ఆర్మీ కుటుంబాల అభ్యర్థులకు 60 సీట్లు కేటాయించారు. ఎల్‌ఎల్‌ఎం కోర్సులో 15 సీట్లు ఉన్నాయి. వీటిలో ఆర్మీ అభ్యర్థులకు 12 సీట్లు ప్రత్యేకించారు. ఇంటిగ్రేటెడ్‌ కోర్సుకు ఇంటర్‌, ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏఐఎల్‌ నిర్వహించే ఎంట్రెన్స్‌ టెస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వెబ్‌సైట్‌: www.ail.ac.in


ఆర్మీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(ఏఐఈ), గ్రేటర్‌ నోయిడా

ఇక్కడ బీఈడీ, బీఈడీ(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సు వ్యవధి రెండేళ్లు. బీఈడీలో 100 సీట్లు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో 30 సీట్లు ఉన్నాయి. కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ టెస్టుని న్యూఢిల్లీలోని గురు గోబింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఇంగ్లీష్‌ కాంప్రహెన్షన్‌, మెంటల్‌ ఎబిలిటీ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఆప్టిట్యూడ్‌ ఫర్‌ టీచింగ్‌ అంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లీషు, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు ఇస్తారు.

వెబ్‌సైట్‌: www. aie.ac.in

Tags :