Education-Article
మేథ్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ మేథమెటిక్స్‌ (ఐఐఎ్‌సఎంఏ)- పాఠశాల విద్యార్థుల కోసం ‘మేథ్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌ (ఎంటీఎ్‌సఈ) 2021’ నిర్వహిస్తోంది. బాలబాలికల్లో మేథమెటిక్స్‌పై అవగాహన పెంచి ఆసక్తిని పెంపొందించేందుకు ఈ పరీక్షను ఉద్దేశించారు. మేథమెటికల్‌ రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ, నోవెల్‌ అప్రోచ్‌, కాన్సెప్టులు, ఆక్యూరసీ, స్పీడ్‌ తదితర అంశాల్లో విద్యార్థుల ప్రతిభను గుర్తించేలా పరీక్ష ఉంటుంది.  మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరూ ఈ పరీక్ష రాయవచ్చు.

ఎంటీఎ్‌సఈ వివరాలు: పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. విద్యార్థులు ఇంటివద్దనే వెబ్‌కామ్‌ సహాయంతో పరీక్ష రాయాలి. పరీక్ష సమయంలో విద్యార్థి కదలికలను రికార్డు చేస్తారు. ముఖం, కళ్లు, పెదాల ఎక్స్‌ప్రెషన్స్‌, గుసగుసల శబ్దాలు, చుట్టూ ఉన్న వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచుతారు. పరీక్ష సమయంలో వెబ్‌కామ్‌ పనిచేయకపోయినా, ఏదైనా అనుమానం వచ్చినా వెంటనే విద్యార్థిని డిబార్‌ చేస్తారు. పరీక్షకు పది రోజుల ముందు విద్యార్థులు సీటు నెంబరు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్‌ టెస్టు. ఇందులో 35 ప్రశ్నలు ఇస్తారు. తరగతిని అనుసరించి ప్రశ్నల స్థాయి ఉంటుంది. ప్రతి ప్రశ్నకూ నాలుగు ఆప్షన్స్‌ ఉంటాయి. వీటిలో సరైనదాన్ని గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. నెగెటివ్‌ మార్కులు లేవు. పరీక్ష సమయం గంట. పరీక్ష పూర్తయిన తరవాత సబ్మిట్‌ చేయగానే స్కోరు చూసుకోవచ్చు.

అవార్డులు: బెంచ్‌మార్క్‌ స్కోర్‌ లేదా 40 కన్నా ఎక్కువ మార్కులు వచ్చినవారిని విజేతలుగా ప్రకటిస్తారు. ప్రతి తరగతిలో విజేతలైన మొదటి 50 మందికి మెరిట్‌ సర్టిఫికెట్‌, నగదు బహుమతి అందిస్తారు. పరీక్ష రాసినవారందరికీ పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు ఇస్తారు. మొదటి ర్యాంక్‌ అభ్యర్థికి రూ.2500; రెండో ర్యాంకుకు రూ.2,000; మూడో ర్యాంక్‌కు రూ.1500, నాలుగో ర్యాంకుకు రూ.1250; అయిదో ర్యాంక్‌కు రూ.1000; ఆరు నుంచి పది ర్యాంకులు సాధించినవారికి ఒక్కొక్కరికి రూ.750; పదకొండు నుంచి ఇరవై ర్యాంకులు వచ్చినవారికి రూ.400; 21 నుంచి 35 ర్యాంకులు పొందినవారికి రూ.300; 36 నుంచి 50 ర్యాంకులు వచ్చినవారికి రూ.250 ఇస్తారు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.250

ఎంటీఎ్‌సఈ 2021 తేదీ: మే 16

ఫలితాలు విడుదల: జూన్‌ 1

మార్కుల పత్రాలు, సర్టిఫికెట్ల డౌన్‌లోడింగ్‌: జూన్‌ 30 నుంచి

రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్‌ 30

వెబ్‌సైట్‌: iisma.com

Tags :