Education-Article
వీజేఐఎంలో పీజీడీఎం

హైదరాబాద్‌లోని విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (వీజేఐఎం) పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం) ప్రోగ్రాములో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ సంస్థకు ఏఐసీటీఈ గుర్తింపు ఉంది. అకడమిక్‌ ప్రతిభ, మేనేజ్‌మెంట్‌ సంబంధిత జాతీయ పరీక్షల్లో సాధించిన స్కోరు ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి వెయిటేజీ నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. 


స్పెషలైజేషన్లు: జనరల్‌, డ్యూయెల్‌

సీట్లు: మొత్తం 240 సీట్లు ఉన్నాయి. డ్యూయెల్‌ స్పెషలైజేషన్‌లో 180, జనరల్‌ విభాగంలో 60 సీట్లు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్‌/ మ్యాట్‌/ గ్జాట్‌/ ఏటీఎంఏ/ సీమ్యాట్‌/ జీమ్యాట్‌లో అర్హత పొంది ఉండాలి. 

వెయిటేజీ: పదోతరగతి మార్కులకు 5, ఇంటర్‌/ పన్నెండో తరగతి మార్కులకు 5, డిగ్రీ మార్కులకు 15, జాతీయ పరీక్ష స్కోరుకు 40, పర్సనల్‌ ఇంటర్వ్యూకి 30, అనుభవానికి 5 శాతం వెయిటేజీ ఇస్తారు.

స్కాలర్‌షిప్‌: ఎంట్రీ లెవెల్‌ కాంపోజిట్‌ స్కోరు 75 శాతానికి మించి సాధించినవారికి మెరిట్‌ స్కాలర్‌షిప్‌ అందిస్తారు. 75 నుంచి 80 శాతం మధ్య వచ్చినవారికి రూ.25,000; 80 నుంచి 85 శాతం మధ్య వచ్చినవారికి రూ.50,000; 85 నుంచి 90 శాతం మధ్య వచ్చినవారికి రూ.75,000; 90 శాతానికి పైగా వచ్చినవారికి రూ.1,00,000 ఇస్తారు. టాప్‌లో నిలిచిన మొదటి నలుగురికి ప్రతి ట్రైమెస్టర్‌లో 50 శాతం ఫీజు రాయితీ ఇస్తారు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.1000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30

వెబ్‌సైట్‌: https://vjim.edu.in


Tags :