Education-Article
ఎస్‌బీఐలో జూనియర్‌ అసోసియేట్స్‌

భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న జూనియర్‌ అసోసియేట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పోస్టు: జూనియర్‌ అసోసియేట్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) 

హైదరాబాద్‌(తెలంగాణ)లో ఉన్న ఖాళీలు: 275

అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి ఏడాది/చివరి సెమిస్టర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

వయసు: 2021 ఏప్రిల్‌ 1 నాటికి 20 - 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్స్‌), లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్ష విధానం: ప్రిలిమినరీ టెస్ట్‌ను 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్‌టైప్‌ విధానంలో ఉంటుంది. పరీక్ష సమయం 60నిమిషాలు. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. సమాధానాన్ని తప్పుగా  గుర్తిస్తే 1/4 మార్కు కట్‌ చేస్తారు.

ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 

30 ప్రశ్నలు 30మార్కులు 20 నిమిషాలు

న్యూమరికల్‌ ఎబిలిటీ

35 ప్రశ్నలు 35 మార్కులు  20 నిమిషాలు

రీజనింగ్‌ ఎబిలిటీ 

35 ప్రశ్నలు 35 మార్కులు 20 నిమిషాలు

ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్స్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో 4 సెక్షన్లు ఉంటాయి. మొత్తం 190 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు.

జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌

50 ప్రశ్నలు 50 మార్కులు 35 నిమిషాలు

జనరల్‌ ఇంగ్లీష్‌ 

40 ప్రశ్నలు 40 మార్కులు 35 నిమిషాలు

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌

50 ప్రశ్నలు 50 మార్కులు 45 నిమిషాలు

రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 

50 ప్రశ్నలు 50 మార్కులు 45 నిమిషాలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 17

ప్రిలిమినరీ పరీక్ష: 2021 జూన్‌లో 

మెయిన్స్‌ పరీక్ష : 2021 జూలై 31

వెబ్‌సైట్‌: https://www.sbi.co.in

Tags :