Education-Article
ఎన్‌జీఆర్‌ఐలో టెక్నికల్‌ సిబ్బంది

హైదరాబాద్‌, ఉప్పల్‌లోని నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) - టెక్నికల్‌ ఉద్యోగుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 38 పోస్టులు ప్రకటించారు.  వచ్చిన దరఖాస్తులు పరిశీలించి విద్యార్హతలు, అనుభవం ఆధారంగా స్ర్కీనింగ్‌ చేస్తారు. వీరికి మాత్రమే పోస్టును అనుసరించి తదుపరి ప్రక్రియలు నిర్వహిస్తారు. టెక్నికల్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు ట్రేడ్‌ టెస్టు అందులో అర్హత పొందినవారికి రాత పరీక్ష ఉంటాయి. సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్లకు ఇంటర్వ్యూ ఉంటుంది. దరఖాస్తులు ఎక్కువగా వచ్చిన పక్షంలో స్ర్కీనింగ్‌కు బదులు రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. 


టెక్నికల్‌ అసిస్టెంట్లు

ఖాళీలు: 21

విభాగాలవారీ ఖాళీలు: జియోఫిజిక్స్‌ 13, జియాలజీ 4, కంప్యూటర్‌ సైన్స్‌ 1, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 1, మేనేజ్‌మెంట్‌ అండ్‌ బిజినెస్‌ 1.

అర్హత: ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగానికి సంబంధిత డిప్లొమా, మిగిలిన విభాగాలకు సంబంధిత సబ్జెక్టులతో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏడాది అనుభవం తప్పనిసరి.

వయసు: దరఖాస్తు నాటికి 28 ఏళ్లు మించకూడదు.

ప్రారంభ వేతనం: రూ.35,400


టెక్నికల్‌ ఆఫీసర్లు

ఖాళీలు: 6

విభాగాలవారీ ఖాళీలు: జియో ఫిజిక్స్‌ 3, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 1, జియాలజీ 2

అర్హత: జియో ఫిజిక్స్‌ విభాగానికి పీజీ (జియో ఫిజిక్స్‌/ అప్లయిడ్‌ జియో ఫిజిక్స్‌/ జియో ఫిజికల్‌ టెక్నాలజీ/ మెరైన్‌ జియో ఫిజిక్స్‌/ ఎర్త్‌ సైన్సెస్‌); జియాలజీ విభాగానికి పీజీ(జియాలజీ/ అప్లయిడ్‌ జియాలజీ/ మెరైన్‌ జియాలజీ/ జియోలాజికల్‌ టెక్నాలజీ/ జియో కెమిస్ట్రీ/ హైడ్రాలజీ); ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగానికి సంబంధిత బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి. నిర్దేశించిన మేరకు అనుభవం అవసరం. వయసు: దరఖాస్తు నాటికి 30 ఏళ్లు మించకూడదు.

ప్రారంభ వేతనం: రూ.44,900


సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్లు

ఖాళీలు: 11

విభాగాలవారీ ఖాళీలు: జియో ఫిజిక్స్‌ 9, జియాలజీ 1, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ 1

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి. నిర్దేశించిన ప్రకారం అనుభవం తప్పనిసరి. వయసు: దరఖాస్తు నాటికి 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 

ప్రారంభ వేతనం: గ్రేడ్‌ 1 ఆఫీసర్లకు రూ.56,100; గ్రేడ్‌ 2 ఆఫీసర్లకు రూ.67,700


రాత పరీక్ష: ఇది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో మూడు పేపర్లు ఉంటాయి. మొత్తం 200 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. మొదటి పేపర్‌లో మెంటల్‌ ఎబిలిటీకి సంబంధించి జనరల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, సందర్భోచిత జడ్జిమెంట్‌  వంటి అంశాల నుంచి 50 ప్రశ్నలు (100 మార్కులు) ఇస్తారు. ఈ పేపర్‌కు పరీక్ష సమయం గంట. రెండో పేపర్‌లో జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ విభాగాలనుంచి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు (75 మార్కులు) ఇస్తారు. పరీక్ష సమయం అర్థగంట. మూడో పేపర్లో సంబంధిత సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు (300 మార్కులు) అడుగుతారు. టెక్నికల్‌ అసిస్టెంట్లకు డిప్లొమా/ డిగ్రీ; టెక్నికల్‌ ఆఫీసర్లకు పీజీ/ బీఈ/ బీటెక్‌ స్థాయుల్లో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం గంటన్నర. మొదటి పేపర్లో రుణాత్మక మార్కులు లేవు. మిగిలిన పేపర్లలో ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. మొదటి పేపర్లో అర్హత సాధిస్తేనే రెండు, మూడు పేపర్లలో వచ్చిన స్కోరు ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.100(సీఎస్ఐఆర్ ఉద్యోగులు, మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 30

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 31

వెబ్‌సైట్: www.ngri.org.in


 

Tags :