Education-Article
ఎన్‌ ఐఈపీఏలో ఎంఫిల్‌, పీహెచ్‌ డీ

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన డీమ్డ్‌ యూనివర్సిటీ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎన్‌ఐఈపీఏ). విద్యారంగానికి సంబంధించి ప్లానింగ్‌లో రీసెర్చ్‌ అలాగే మేనేజ్‌మెంట్‌ సంస్థగా దక్షిణాసియాలోనే దీనికి మంచి పేరు ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ పరిశోధనలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 


స్తవానికి యునెస్కో 1962లో దీన్ని ఏర్పాటుచేసింది. ఆసియన్‌ రీజినల్‌ సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానర్స్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌గా ఏర్పడింది. 1965లో దీన్ని ఆసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌గా మలిచారు. నేషనల్‌ స్టాఫ్‌ కాలేజీగా సంస్థ కార్యకలాపాల విస్తరించడంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌గా మార్చింది. ప్రస్తుతం ఆఫర్‌ చేస్తున్న కోర్సుల వివరాలు ఇలా ఉన్నాయి. 

ఇంటిగ్రేటెడ్‌ ఎంఫిల్‌ - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌: కనీసం 55 శాతం(రిజర్వుడ్‌ వర్గాలకు 50 శాతం) మార్కులతో సోషల్‌ సైన్సెస్‌ అలాగే సంబంధిత డిసిప్లిన్‌లలో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. టీచింగ్‌ లేదంటే ఎడ్యుకేషనల్‌ పాలసీ, ప్లానింగ్‌, అడ్మినిస్ట్రేషన్‌ ఏరియాల్లో అనుభవం అభిలషణీయం. తాము చేయాలనుకునే పరిశోధన వివరాలను నిర్దేశిత ప్రొఫార్మాలో మూడు కాపీలను దరఖాస్తుతో జతచేయాలి.

పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌: పై ప్రోగ్రామ్‌కు నిర్దేశించిన నిబంధనలు పాటించాలి. 

దానికి తోడు బ్రిలియంట్‌ అకడమిక్‌ రికార్డు ఉండాలి. సంబంధిత అంశాల్లో ఎంఫిల్‌ పూర్తి చేసి ఉండాలి.

పార్ట్‌ టైమ్‌ పీహెచ్‌డీ: పై ప్రోగ్రామ్‌లకు పేర్కొన్న అర్హతలు అన్నీ ఉండాలి. అయితే, అయిదేళ్ళ వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉండాలి. ఒక ఏడాది ఫుల్‌టైమ్‌ కోర్సు వర్క్‌ కూడా చేయడానికి సంసిద్ధులై ఉండాలి. ఇది తప్పనిసరి.

ఎంపిక: షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు రాతపరీక్ష ఆపై పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా 

ఫీజు: రూ.400 (రిజర్వుడు వర్గాలకు రూ.200)

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 15

సంస్థ చిరునామా: Registrar, NIEPA, 17B, Sri Aurobindo Marg, New Delhi110016

వెబ్‌సైట్‌: www.niepa.ac.in

Tags :