Education-Article
తిరుపతి ఐసర్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రాములు

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసర్‌) పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. అకడమిక్‌ ప్రతిభ, జాతీయ పరీక్షల్లో సాధించిన స్కోరు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి టెలిఫోనిక్‌/ ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.


పీహెచ్‌డీ

విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌

కెమిస్ట్రీ స్పెషలైజేషన్లు: ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, థియరిటికల్‌ అండ్‌ కంప్యూటేషనల్‌ కెమిస్ట్రీ, ఫిజికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ కెమిస్ట్రీ, కెమికల్‌ బయాలజీ తదితరాలు.

బయాలజీ స్పెషలైజేషన్లు: ప్లాంట్‌ బయాలజీ, డెవలప్‌మెంటల్‌ అండ్‌ స్టెమ్‌ సెల్‌ బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌ అండ్‌ సిస్టమ్స్‌ బయాలజీ, బయో ఫిజిక్స్‌ అండ్‌ బయో మాలిక్యులర్‌ స్పెకో్ట్రస్కోపి, న్యూరో బయాలజీ, ఇన్‌ఫెక్షన్‌ బయాలజీ, మాలిక్యులర్‌ మైక్రోబయాలజీ, క్యాన్సర్‌ బయాలజీ, ఇమ్యూనాలజీ, జినోమ్‌ బయాలజీ, తదితరాలు.

ఫిజిక్స్‌ స్పెషలైజేషన్లు: ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌, డేటా సైన్స్‌, కండెన్స్‌డ్‌ మేటర్‌ థియరీ, అటామిక్‌ అండ్‌ మాలిక్యులర్‌ ఫిజిక్స్‌, కాంప్లెక్స్‌ సిస్టమ్స్‌, ఆర్గానిక్‌ ఆప్టో ఎలకా్ట్రనిక్స్‌, సాఫ్ట్‌ అండ్‌ యాక్టివ్‌ మేటర్‌, మైక్రో ఫ్లూయిడ్స్‌, హై ఎనర్జీ ఫిజిక్స్‌, బయో ఫిజిక్స్‌ తదితరాలు.

అర్హత: కెమిస్ట్రీ విభాగానికి ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ మేథమెటిక్స్‌/ బయాలజీ; ఫిజిక్స్‌ విభాగానికి ఫిజిక్స్‌/ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ మేథమెటిక్స్‌/ బయాలజీ స్పెషలైజేషన్లతో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌/ ఎంఈ/ ఎంటెక్‌ పూర్తిచేసి ఉండాలి. కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.  


సీఎ్‌సఐఆర్‌/ యూజీసీ/ నెట్‌/ జెస్ట్‌/ఇన్‌స్పయిర్‌ పీహెచ్‌డీ ఫెలోషిప్‌నకు అర్హత పొంది ఉండాలి. బయాలజీ విభాగానికి ద్వితీయ శ్రేణి మార్కులతో పీజీ(ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ మేథమెటిక్స్‌/ బయోలాజికల్‌ సైన్సెస్‌/ ఎకోలాజికల్‌ సైన్సెస్‌/ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌/ సైకాలజీ)/ ఎంటెక్‌/ ఎంవీఎస్సీ/ ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు.  డీబీటీ - జేఆర్‌ఎఫ్‌ - ఏ / ఐసీఎంఆర్‌ - జేఆర్‌ఎఫ్‌/ డీబీటీ - బీఐఎన్‌సీ / యూ జీసీ - సీఎ్‌సఐఆర్‌ - జేఆర్‌ఎఫ్‌/ డీఎ్‌సటీ - ఇన్‌స్పయిర్‌ - జేఆర్‌ఎఫ్‌ అర్హత పొంది ఉండాలి. అన్ని విభాగాలకూ 60 శాతానికి మించిన మార్కులతో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులు కూడా  దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులో చేరేనాటికి అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.


ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ

విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌

అర్హత: బయాలజీ విభాగానికి  బయోలాజికల్‌ సైన్సెస్‌/ ఎకోలాజికల్‌ సైన్సెస్‌/ మేథమెటిక్స్‌/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్‌/ మెడికల్‌ సైన్సెస్‌/ ఇంజనీరింగ్‌ సంబంధిత సబ్జెక్టులతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.  కెమిస్ట్రీకి బీఎస్సీ(జనరల్‌/ కెమిస్ట్రీ - మేథమెటిక్స్‌ - ఫిజిక్స్‌/ బయాలజీ)/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత అవసరం. మేథమెటిక్స్‌కు బీఎస్సీ/ తత్సమాన డిగ్రీ పాసైతే చాలు. ఫిజిక్స్‌కు బీఎస్సీ/ బీఈ/ బీటెక్‌ పూర్తిచేసి ఉండాలి.  కోర్సు ఏదైనా 60 శాతం మార్కులు ఉండాలి. సంబంధిత విభాగాల్లో జామ్‌ 2021 అర్హత స్కోరు తప్పనిసరి. బయాలజీకి జేజీఈఈబీఐఎల్‌ఎస్‌ 2021 అర్హత స్కోరు, మేథ్స్‌కు ఎన్‌బీహెచ్‌ఎం స్కాలర్‌షిప్‌ అర్హత ఉన్నా సరిపోతుంది.


ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 23

ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ విడుదల: జూన్‌ 1 నుంచి 10 వరకు

ఇంటర్వ్యూలు: జూన్‌ 11 నుంచి 25 వరకు

ఇంటర్వ్యూ ఫలితాలు విడుదల: జూన్‌ 26 నుంచి జూలై 5 వరకు

కోర్సులో జాయినింగ్‌: ఆగస్టు 2 నుంచి

వెబ్‌సైట్‌: iisertirupati.ac.in

Tags :