Education-Article
ఎంఐటీ- డబ్ల్యూపీయూలో ఎంబీఏ

టాప్‌ బీ స్కూల్‌ పుణెలోని ఎంఐటి వరల్డ్‌ పీస్‌ యూనివర్సిటీ(డబ్ల్యూపీయూ) ఎంబీఏలో చేరేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంఐటి- డబ్ల్యూపీయూకి చెందిన స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ కోర్సును ఆఫర్‌ చేస్తోంది ఎంబీఏలో డ్యూయల్‌ స్పెషలైజేషన్‌ చేసేందుకు ఇక్కడ అవకాశం ఉంటుంది. అంటే మేజర్‌, మైనర్‌ కలగలిసి ఇక్కడ అందిస్తున్నారు. 


స్పెషలైజేషన్లు

- ఎంబీఏ ఇన్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(మార్కెటింగ్‌ + ఫైనాన్స్‌ లేదా హ్యూమన్‌ రిసోర్స్‌)

- ఎంబీఏ ఇన్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌(మార్కెటింగ్‌ +ఫైనాన్స్‌ లేదా హ్యూమన్‌ రిసోర్స్‌)

- ఎంబీఏ ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌(మార్కెటింగ్‌ +ఫైనాన్స్‌ లేదా హ్యూమన్‌ రిసోర్స్‌)

- ఎంబీఏ ఇన్‌ జనరల్‌  మేనేజ్‌మెంట్‌

- ఎంబీఏ ఇన్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌

- ఎంబీఏ ఇన్‌ మార్కెటింగ్‌

- ఎంబీఏ ఇన్‌ హెచ్‌ఆర్‌

- ఎంబీఏ ఇన్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ 

- ఎంబీఏ ఇన్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌

- ఎంబీఏ ఇన్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌

- ఎంబీఏ ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌

- ఎంబీఏ ఇన్‌ బిజినెస్‌ అనలిటెక్స్‌


క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ నిర్వహిస్తారు. ఇప్పటివరకు ఏటా 400కి మించి అభ్యర్థులు ప్లేస్‌మెంట్స్‌ పొందుతున్నారు. గరిష్ఠ వేతనం రూ.12.4 లక్షలు. అర్హులైన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వూ నిర్వహించి సీట్లను ఖరారు చేస్తుంది. కనీసం 50 శాతం(రిజర్వుడు వర్గాలకు 45 శాతం)మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సులు చేసేందుకు అర్హులు. ఆఖరు ఏడాది డిగ్రీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి తోడు క్యాట్‌/ మ్యాట్‌/ సీమ్యాట్‌/ ఎక్స్‌ఏటి/ జీమ్యాట్‌/ ఎంహెచ్‌సెట్‌లో ర్యాంకు పొంది ఉండాలి.  


రిజిస్ట్రేషన్‌ లింక్‌: https://apply.mitwpu. edu.in/admission/ mba/application

Tags :