Education-Article
ఆర్‌ఐఈలో డిప్లొమా, పీజీ డిప్లొమా

బెంగళూరులోని రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ సౌత్‌ ఇండియా (ఆర్‌ఐఈఎ్‌సఐ)- డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఒక్కో కోర్సు వ్యవధి ఏడాది. వీటిని దూరవిద్యా విధానంలో నిర్వహిస్తారు. 


డిప్లొమా

విభాగం: ఇంగ్లీష్‌ కమ్యూనికేషన్‌

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌/ పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. 

కోర్సు వివరాలు: ఇందులో మూడు ప్రధాన మాడ్యూల్స్‌  ఉంటాయి. అవి ఫ్లూయెన్సీ, ఆక్యూరసీ, డిస్‌కోర్స్‌ మేనేజ్‌మెంట్‌. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ పెడగాగి, ఇంగ్లీష్‌ ఫర్‌ బిజినెస్‌, ఇంగ్లీష్‌ ఫర్‌ మీడియా అనే ఆప్షనల్‌ మాడ్యూల్స్‌లో ఒకదాన్ని ఎంచుకోవాలి. ఫ్లూయెన్సీ మాడ్యూల్‌లో ఒకాబులరీ, గ్రామర్‌, లిజనింగ్‌, స్పీకింగ్‌, రీడింగ్‌, రైటింగ్‌ అంశాలుంటాయి. ఆక్యూరసీ మాడ్యూల్‌లో పదాలు, వాక్యాలు, ఉచ్ఛారణ, వ్యాకరణం తదితరాంశాలు బోధిస్తారు. డిస్‌కోర్స్‌ మేనేజ్‌మెంట్‌లో సందర్భానుసారంగా ఉపయోగించాల్సిన పదాలు, వాక్యాల నిర్మాణం వివరిస్తారు. పెడగాగిలో ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ బోధనలో ఆధునిక పోకడలపై వివరణ ఉంటుంది. మిగిలిన మాడ్యూల్స్‌లో మీడియా, వర్తక వ్యాపారాల్లో ఆంగ్ల భాష ఉపయోగించే విధానాలు ఉంటాయి.

కాంటాక్ట్‌ ప్రోగ్రాముల వివరాలు: ఈ కోర్సులో రెండు కాంటాక్ట్‌ ప్రోగ్రాములు ఉంటాయి. మొదటిదానిలో రెండు రోజులు, రెండో దానిలో 18 రోజులు తరగతులు నిర్వహిస్తారు.

కోర్సు ఫీజు: రూ.3,000


పీజీ డిప్లొమా

విభాగం: ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

కోర్సు వివరాలు: ఇందులో నాలుగు మాడ్యూల్స్‌ ఉంటాయి. ఒక్కోదానిలో 3 - 4 యూనిట్లు ఉంటాయి. లెర్నింగ్‌ మెటీరియల్‌ కింద 6 బుక్‌లెట్లు ఇస్తారు. ఒక్కోదానిలో 2 చొప్పున మొత్తం 12 అసైన్‌మెంట్లు పూర్తిచేయాల్సి ఉంటుంది. లిజనింగ్‌ అండ్‌ స్పీకింగ్‌, రీడింగ్‌, రైటింగ్‌, లాంగ్వేజ్‌ వర్క్‌, మెథడ్స్‌ అండ్‌ మెటీరియల్స్‌, టీచర్‌ డెవల్‌పమెంట్‌, టీచింగ్‌ ప్రాక్టీస్‌ అంశాలను ప్రధానంగా బోధిస్తారు. కోర్సు చివరలో ఫైనల్‌ ఎగ్జామినేషన్‌, ఓరల్‌ ప్రొడక్షన్‌ టెస్టు నిర్వహిస్తారు.

కాంటాక్ట్‌ ప్రోగ్రామ్‌ వివరాలు: ఈ కోర్సులో కూడా రెండు కాంటాక్ట్‌ ప్రోగ్రాములు ఉంటాయి. మొదటిది అక్టోబరు నెలలో ఉంటుంది. ఇందులో మూడు రోజులపాటు తరగతులు ఉంటాయి. రెండోదానిని ఏప్రిల్‌/ మే నెలలో నిర్వహిస్తారు. ఇందులో 22 రోజులపాటు తరగతులు ఉంటాయి. 

కోర్సు ఫీజు: రూ.9,000


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.250

రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మే 31

దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: పదోతరగతి/ ఇంటర్‌/ డిగ్రీ మార్కుల పత్రాలు, ఆధార్‌ కార్డు, రెండు ఫొటోలు

కోర్సులు ప్రారంభం: జూన్‌ 1 నుంచి

వెబ్‌సైట్‌: riesielt.org


Tags :