Education-Article
జాయింట్‌ డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఆస్ట్రేలియాలోని డీకిన్‌ యూనివర్సిటీ ఉమ్మడిగా డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌ని నిర్వహిస్తున్నాయి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాల్లో ప్రతిభ గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు ఏడాదిపాటు డీకిన్‌ యూనివర్సిటీలో పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. కోర్సు పూర్తిచేసినవారికి రెండు యూనివర్సిటీలు పీహెచ్‌డీ ప్రదానం చేస్తాయి.


అర్హత: డిజైన్‌/ ఇంజనీరింగ్‌/ సైన్స్‌ విభాగాల్లో  పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. 10 పాయింట్ల స్కేల్‌ మీద 8.5 సీజీపీఏ సాధించి ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌ / సైన్స్‌  విభాగాల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి వ్యాలిడ్‌ గేట్‌ స్కోరు తప్పనిసరి. ఐఐటీలు, నిట్‌లనుంచి డిగ్రీ పూర్తిచేసినవారికి గేట్‌ స్కోరు అవసరం లేదు. వీరు ముందుగా ఐఐటీహెచ్‌లో ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. తరవాత నేరుగా పీహెచ్‌డీలోకి ప్రవేశం కల్పిస్తారు.


ముఖ్య సమాచారం

ఫెలోషిప్‌ వ్యవధి: నాలుగేళ్లు

ఐఐటీహెచ్‌ అభ్యర్థులకు రెగ్యులర్‌ ఫెలోషిప్‌ అందిస్తుంది. డీకిన్‌ యూనివర్సిటీకి వెళ్లాక ఏడాదికి 28,600 ఆస్ట్రేలియన్‌ డాలర్లు ఇస్తుంది. డీకిన్‌ యూనివర్సిటీ కోర్సు మొత్తానికి ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తుంది. ఐఐటీహెచ్‌లో కోర్సు చేస్తున్నంత కాలం (మూడేళ్లపాటు) నెలకు 150 ఆస్ట్రేలియన్‌ డాలర్ల స్టయిపెండ్‌ ఇస్తుంది.

ఈమెయిల్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30

ఈ మెయిల్‌: [email protected]

వెబ్‌సైట్‌: iith.ac.in/iar/ IITHDeakin/

Tags :