Education-Article
తెలంగాణ గురుకులాల్లో ఆర్‌జేసీ & ఆర్‌డీసీ సెట్‌

హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ - ఇంటర్మీడియెట్‌, మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్‌జేసీ ్క్ష ఆర్‌డీసీ సెట్‌ 2021 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ గురుకుల కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. తెలంగాణ జిల్లాల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.


ఇంటర్మీడియెట్‌ 

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 134 రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. బాలురకు 66, బాలికలకు 68 కాలేజీలను ప్రత్యేకించారు. 

గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు

అర్హత: ప్రస్తుతం పదోతరగతి పూర్తిచేసుకొన్న అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. 


డిగ్రీ

రెసిడెన్షియల్‌ మహిళా డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

కోర్సులు: బీఎస్సీ(ఎంపీసీ, ఎంఎ్‌ససీఎస్‌, ఎంపీసీఎస్‌, బీజడ్‌సీ, బీబీసీ, డేటా సైన్స్‌), బీఏ(హెచ్‌ఈపీ, హెచ్‌పీఈ), బీకాం(జనరల్‌, కంప్యూటర్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌)

అర్హత: ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌ చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్ధమవుతున్న అమ్మాయిలు దరఖాస్తు చేసుకోవచ్చు. 


ముఖ్య సమాచారం

ఎంపిక: ఆర్‌జేసీ ్క్ష ఆర్‌డీసీ సెట్‌ 2021లో సాధించిన స్కోరు, రిజర్వేషన్‌ నియమాల ప్రకారం అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలో ఇంటర్‌ ప్రవేశానికి పదోతరగతి స్థాయిలో, డిగ్రీ ప్రవేశానికి ఇంటర్‌ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. 

దరఖాస్తు ఫీజు: రూ.200

దరఖాస్తుకు చివరి తేదీ: మే 31

హాల్‌టికెట్‌ డౌన్‌లోడింగ్‌: జూన్‌ 4

ఆర్‌జేసీ & ఆర్‌డీసీ సెట్‌ 2021 తేదీ: జూన్‌ 13

వెబ్‌సైట్‌: mjptbcwreis.telangana.gov.in

Tags :